'వాళ్లకు డబ్బే ముఖ్యం'... అల్లు అర్జున్, దిల్ రాజుపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సృష్టించిన ప్రకంపనలు ఇంకా వినిపిస్తున్నే ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-12-25 06:39 GMT

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సృష్టించిన ప్రకంపనలు ఇంకా వినిపిస్తున్నే ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో... సినిమా వాళ్లకు డబ్బుల గురించి ఆలోచన మాత్రమే అని.. రాజకీయ నాయకులకు మాత్రం పేదల గురించిన ఆలోచన అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెలే అనిరుధ్ రెడ్డి.

అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ‘పుష్ప-2’ సినిమా హీరో అల్లు అర్జున్ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తాజాగా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సినిమవాళ్లకు, పొలిటీషియన్స్ కు ఉన్న తేడా ఇది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా స్పందించిన అనిరుధ్ రెడ్డి... సంధ్య థియేటర్ ఘటన చాలా బాధకరం అని.. అయితే... ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని అన్నారు. ఈ సందర్భంగా... ‘పుష్ప-2’ సినిమా రు.1700 కోట్లు వసూల్ అని చెబుతున్నప్పుడు.. బాధితురాలికి ఓ కోటి రూపాయలు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.

ప్రధానంగా... మన దేశంలో క్రీడాకారులు, సినిమావాళ్లు, రాజకీయ నాయకులు బాగా ఫేమస్ అని.. అయితే నేడు పొలిటీషియన్స్ సినిమా ఫీల్డ్ కొట్టుకుంటుంటే కొంతమంది నవ్వుతున్నారని తెలిపారు. ఇక ప్రధానంగా... ఈ ఘటన ఇంత చర్చనీయాంశం అయిన వేళ ఘటన జరిగిన రోజే ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు బాధిత కుటుంబాన్ని కలిసి సమన్వయం చేసి ఉంటే.. పరిస్థితి ఇంతదూరం వచ్చి ఉండేది కాదని అన్నారు.

రాజకీయ నాయకులు పేదల గురించి ఆలోస్తుంటే.. సినిమా వాళ్లు మాత్రం రూపాయి పెట్టి పది రూపాయలు వచ్చాయా లేదా అని ఆలోచిస్తారని అన్నారు. ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఎవరూ స్పందించలేదని స్పష్టం చేశారు.

ఇక... ఈ సమయంలో బాధిత కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షలు ఇచ్చారని.. ఆ తర్వాత నిర్మాతలు వెళ్లి రూ.50 లక్షలు ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప-2’ సినిమాకు రూ.1,700 కోట్లు వసూళ్లు వచ్చాయని చెబుతున్న వేళ.. అందులో ఓ కోటి రూపాయలు బాధిత కుటుంబానికి ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు

Tags:    

Similar News