వామ్మో... బ్రిక్స్ కు ట్రంప్ ఇచ్చింది మామూలు వార్నింగ్ కాదు!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ తనదైన శైలిలో ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ తనదైన శైలిలో ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరీ స్పెషల్ ఫ్లైట్స్ లో స్వదేశాలకు పంపించేస్తున్న ట్రంప్.. మరికొంతమంది ప్రమాదకరమైన అక్రమ వలసదారులను ఉగ్రవాదులను బంధించే జైళ్లకు తరలిస్తున్న పరిస్థితి.
ఈ సమయంలో తమ దేశ పౌరులను నేరస్థులుగా ట్రీట్ చేస్తూ, సైనిక విమానంలో పంపడంపై కొలంబియా అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఆ అమెరికా విమానాలను వెనక్కి పంపింది. దీంతో.. ఆదేశంపై సుంకాలు 25% పెంచుతున్నట్లు వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడింది.. ముందుముందు ఇలాంటివి చాలా ఉంటాయనే సంకేతాలు పంపిన పరిస్థితి.
కట్ చేస్తే... అమెరికా నుంచి అక్రమవలసదారులను తీసుకొని బయలుదేరిన ఫ్లైట్స్ కొలంబియాలో ల్యాండ్ అయ్యాయి.. పని పూర్తి చేసి తిరిగొచ్చాయి. అప్పుడు కొలంబియాపై పెంచిన సుంకాలు ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ స్థాయిలో బెదిరిస్తున్న ట్రంప్.. తాజాగా బ్రిక్స్ దేశాలకు బీభత్సమైన షాక్ ఇచ్చారు.
అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్ డాలర్ కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రిక్స్ దేశాల ఎగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అమెరికా డాలర్ ను పక్కనపెడితే తీవ్ర ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వాస్తవానికి.. గత ఏడాది అక్టోబర్ లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిజిటల్ కరెన్సీని వాడుకోవాలని ప్రతిపాదించారు.
ఇదే సమయంలో... బ్రిక్స్ సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్ కోరారు. ఈ నేపథ్యంలో దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొన్న డొనాల్డ్ ట్రంప్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. డాలర్ కు బదులుగా బ్రిక్స్ దేశాలు మరో కరెన్సీని సృష్టించలేవని అన్నారు.
ఒకవేళ అలాంటి ఆలోచన చేసి, డాలర్ ను వదులుకుంటే మాత్రం అద్భుతమైన యూఎస్ అమెరికా ఎకానమీలో అమ్మకాలకు గుడ్ బై చెప్పి.. ఆయా దేశాలు ప్రయోజనం కోసం మరో దేశాన్ని ఎన్నుకోక తప్పదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమయంలో బ్రిక్స్ దేశాల దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని.. అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాలని హెచ్చరించారు!