తెలంగాణ కాంగ్రెస్‌లో ఏక్ నిరంజ‌న్‌... ఒకే ఒక్క‌డు...!

అయితే అప్పటినుంచి ఇప్పటివరకు అంతా ఏక నిరంజన్ ఒకే ఒక్కడు అన్నట్టుగా ఉందే తప్ప పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2025-01-31 20:30 GMT

తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక గత సెప్టెంబర్ లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మహేష్ గౌడ్ ను పార్టీ అధిష్టానం నియమించింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు అంతా ఏక నిరంజన్ ఒకే ఒక్కడు అన్నట్టుగా ఉందే తప్ప పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేష్ గౌడ్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఇన్ని రోజులపాటు పీసీసీ కార్యవర్గం లేకుండా పార్టీ నడవలేదు అన్న చర్చ‌ జరుగుతోంది. గాంధీభవన్ వర్గాలలో గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ప్రధాన కార్యదర్శులు.. ప్రచార కమిటీ చైర్మన్ లను కూడా ఒకేసారి ప్రకటించారు. ఎన్నికలవేళ అప్పుడు అలా ప్రకటన చేసినట్టు పార్టీ హైకమండ్ చెప్పుకున్నా ఇప్పుడు అధికారంలో ఉండి కనీసం పూర్తిస్థాయిలో కమిటీ వేసుకోలేని వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మహేష్ గౌడ్ కూడా పార్టీ విస్తృతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారట. అయితే అధిష్టానం నుంచి కమిటీ నియమకానికి సంబంధించి ఎప్పటి వరకు ఎలాంటి దశాదిశా లేదని తెలుస్తోంది. ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపై పార్టీ వర్గాల మధ్య విస్తృతమైన చర్చి జరిగినట్లు తెలిసింది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి కసరతులు చేయాలని కేసి వేణుగోపాల్ సూచనలు చేశారని సమాచారం. ఈ సమావేశం జరిగి చాలా రోజులు అయినా కూడా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడుతున్న సందర్భాలు లేవు. అటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాక.. ఇటు పార్టీలో పదవులు లేక చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవాలని పరిస్థితి పిసిసి అధ్యక్షుడిని నియమించి ఆరు నెలలు అవుతున్నా పూర్తి స్థాయిలో కమిటీ ఎందుకు వేసుకోవటం లేదు అన్నది ఎవరికీ అంతుపడటం లేదు. పదవుల కోసం చాలామంది నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా 10 ఏళ్లపాటు ఎన్నో అష్ట కష్టాలు పడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వాళ్లకు ఎప్పటికీ అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీ పరంగా ఎలాంటి పదవులు లేవు. దీంతో వీరంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవులు ఆశించే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. కొందరికి ప్రభుత్వంలో మరికొందరికి పార్టీలో అవకాశం ఇస్తే బాగుంటుంది.

ఇప్పటిదాకా ఏది జరగకపోవడంతో అంతా అయోమయం గందరగోళం మారింది. ఇటు పిసిసి అధ్యక్షుడికి కూడా తన టీం లేకపోతే చేయి విరిగినంత పని అవుతుందట. అన్ని పనులు ఆయనే చ‌క్కపెట్టుకోలేని పరిస్థితి.. వెంటనే ఉపాధ్యక్షులను నియమించుకుంటే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేక కట్టుతప్పుతోందన్న వాదన బలపడుతుంది. పదవులు లేక‌ పనిచేయటానికి ఎవరు ముందుకురాని పరిస్థితి. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్న ఇంకా ఏం లేదంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్‌ అధిష్టానం కళ్ళు తెరవకపోతే పార్టీ మరింతగా నష్టపోవడం ఖాయం.

Tags:    

Similar News