షెకావత్ ను మించి... ఏసీపీ వ్యాఖ్యలపై డీసీపీ సీరియస్!
ఆ వ్యాఖ్యలు తర్వాత అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి, తనపై తప్పుడు ప్రచారం అంటూ స్పందించడం మరింత వైరల్ గా మారింది.
సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అనంతరం వాతావారణం ఒక్కసారిగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు తర్వాత అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి, తనపై తప్పుడు ప్రచారం అంటూ స్పందించడం మరింత వైరల్ గా మారింది. ఈ సమయంలో ఏసీపీ విష్ణుమూర్తి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుముర్తి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడిన ఏసీపీ విష్ణు... ఓ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టొచ్చా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా.. కొంతమంది నటులు, రాజకీయ నాయకులు పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతూ... తాము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అని అన్నారు. ఇలా ఎవరికివారు నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటే కుదరదని.. సినిమాల్లో పోలీసు అధికారిని వ్యంగ్యంగా చూపించారని అన్నారు.
అనంతరం మరింత డోసు పెంచిన ఆయన... ఒక్క పోలీసు అధికారిని కూడా నీ దగ్గరకు రాకుండా చేస్తాం.. ఎలా బయటకు వెళ్తావో చూస్తాం.. పోలీసు అధికారుల ఓపిక నశిస్తే.. ఎక్కడ ఎం కట్ చేయాలో అన్ని తమకు తెలుసు అంటూ విష్ణుమూర్తి విరుచుకుపడిపోయారు. ఎవడైనా సరే తోలు తీస్తాం అంటూ హెచ్చరించారు.
ఇలా మైకుల ముందు విరుచుకుపడిన ఏసీపీ విష్ణుమూర్తి వ్యాఖ్యలు ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. ఇందులో భాగంగా.. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ స్పందిస్తూ.. విష్ణుమూర్తి ఇప్పటికె సస్పెన్షన్ లో ఉన్నారని తెలిపారు.
ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ప్రెస్ మీట్ పెట్టారని.. దీంతో.. నిబంధనలు ఉల్లంఘించిన విష్ణుపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని.. ఇట్లాంటివి తాము అసలు సహించమని డీసీపీ సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో.. అల్లు అర్జున్ పై విష్ణు చేసిన వ్యాఖ్యలకు తాము చింతిస్తున్నట్లు డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ తెలిపారు.