అదానీ గుర్తు పెట్టుకో.. అది అమెరికా!
ఈ విషయం ప్రధానంగా భారత్ లో తీవ్ర సంచలనంగా మారింది. దీంతో... అదానీ గ్రూపులోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి.
అదానీ గ్రూపు సంస్థ ఛైర్మన్ గౌతం అదానీపై అమెరికాలో తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. ఈ విషయం ప్రధానంగా భారత్ లో తీవ్ర సంచలనంగా మారింది. దీంతో... అదానీ గ్రూపులోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనిపై సంస్థ అధికారికంగా స్పందించింది. ఈ మేరకు ఎన్.ఎస్.ఈ.కి లేఖ రాసింది.
అవును... గౌతం అదానీపై అమెరికాలో తీవ్ర అభియోగాలు నమోదయ్యాయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈ కంపెనీ, అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇవ్వజూపడమే గాక, దాని గురించి పెట్టుబడిదారులకు తప్పుడు సమాచరం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడింది అని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
ఇందులో భాగంగా... 20 ఏళ్లలో అదానీ, దాని అనుబంధ సంస్థలు 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందాడం కోసం భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఆఫర్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో.. గౌతం అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానితో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.
డాలర్ డినామినేషన్స్ బాండ్ల జారీ నిలివేత!:
ఈ సందర్భంగా స్పందించిన అదానీ సంస్థ... యునైటెడ్ స్టేస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమిషన్ లు మా బోర్డు సభ్యులు గౌతం అదానీ, సాగర్ అదానీకి వ్యతిరేకంగా క్రిమినల్ నేరారోపణలు జారీచేశాయని.. ఇదే సమయంలో వినీత్ జైన్ పై కూడా అటువంటి నేరారోపణలు చేసిందని వెల్లడించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. మా అనుబంధ సంస్థలు ప్రస్తుతం ప్రతిపాదిత యూఎస్డీ డినామినేటెడ్ బాండ్ ఆఫర్లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం స్టాక్ మార్కెట్ కు అందజేసిన ఫైలింగ్ లో పేర్కోంది. ఈ ఆఫర్ విలువ 600 మిలియన్ డాలర్లు.
భారీగా పతనమైన అదానీ షేర్లు!:
ఈ పరిణామల నేపథ్యంలో అదానీ గ్రూపులోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇందులో భాగంగా... అదానీ ఎంటర్ ప్రైజెస్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ 15%, అదానీ టోటల్ గ్యాస్ 15%, అదానీ పవర్ 14%, అదానీ సిమెంట్స్ 12%, అదానీ విల్మార్ 10% నష్టపోయాయి.
మొత్తంగా గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ రూ.14.28 లక్షల కోట్ల నుంచి రూ.12.42 లక్షల కోట్లకు పడిపోయినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఈ గ్రూపులో పెట్టుబడిదారు అయిన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టర్నర్స్ కి సంబందించిన షేర్లు కూడా ఏకంగా 25% కుంగినట్లు తెలుస్తోంది.
అమెరికాతో అంత ఈజీ కాదు!:
భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతం అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లాంచాలు ఆఫర్ చేశారని.. ఇదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) ఆరోపిస్తోంది.
అయితే... ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్... ప్రపంచంలో ఏమూలైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినా సహించబోమని వెల్లడించారు.
ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్స్ కరెప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు ఆ దేశ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ యాక్ట్ లక్ష్యం ఏమిటంటే.. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే. దీని ఉల్లంఘనను ఆ దేశం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది.
వాస్తవానికి భారత్ లో అదానీకి అడ్డేమీ లేదని అంటుంటారు! కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఆడింది ఆట, పాడింది పాట అంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి! దీనిలో ఎంత వాస్తవం.. మరెంత అవాస్తవం అనేది దాదాపు అందరికీ తెలిసిందే అనేది మరో కీలక వ్యాఖ్యానం!
అయితే... అది అమెరికా.. పైగా అమెరికా న్యాయ శాఖను పునర్నిర్మిస్తానని ప్రతినబూనిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి! దానికి తోడు అక్కడ అదానీ & కో చేసిన చట్ట ఉల్లంఘన తీవ్రమైన నేరం. మరి ఈ వ్యవహారం ఎలాంటి కన్ క్లూజన్ కి వస్తుందనేది వేచి చూడాలి! ఈ నేరం నిరూపితమైతే అదానీ అమెరికాలో శిక్ష అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు!