షర్మిలను రెచ్చగొడుతున్న జగన్.. భలే ఐడియా!
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల.. తర్వాత దూకుడుగా అన్నను లక్ష్యం చేసుకున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భలే ఐడియా వేశారు. తనవైపు శర వేగంగా విమర్శలు సంధిస్తున్న సోదరి షర్మిలను ఇరకాటంలోకి నెట్టేందుకు రెచ్చగొట్టే తంత్రానికి తెరదీశారని రాజకీయ వర్గాలు భావిస్తు న్నాయి. షర్మిల ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడినా.. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా జగన్‌ను టార్గెట్ చేసుకుం టున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా.. పలు విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల.. తర్వాత దూకుడుగా అన్నను లక్ష్యం చేసుకున్నారు.
వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగిన షర్మిల అనుకున్నది సా ధించారు. ఆ తర్వాతకూడా.. జగన్‌ను పలు రూపాల్లో టార్గెట్ చేసుకున్నారు. ఒకానొక దశలో జగన్‌కు బద్ధ శత్రువులు కూడా రెచ్చిపోని విధంగా షర్మిల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో వైసీపీ డిఫెన్స్‌లో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు కూడా ఆమె దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో షర్మిలను కట్టడి చేయాలని జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కానీ, షర్మిలకు జగన్ ఏం అన్యాయం చేశారో ఇతమిత్థంగా తెలియదు కానీ.. ఆమె ఆగ్రహం మాత్రం చల్లా రడం లేదు. దీంతో ఇప్పుడు జగన్ యూటర్న్ తీసుకున్నట్టు తీసుకుని, షర్మిలను పరోక్షంగా రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరదీస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలయ్య ను అడ్డు పెట్టుకుని పాత సంగతులు తొవ్వేశారు జగన్. గతంలో బాలకృష్ణ ఇంటి నుంచే షర్మిలపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ.. జగన్ ఆవేశ పడ్డారు.
దీనికి సంబంధించి గతంలో షర్మిల చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను కూడా ప్రదర్శించారు. అంటే.. ఇక్కడ జగన్ ఉద్దేశం.. తన చెల్లిని ఎవరో ఏదో అన్నారని.. తాను కుమిలి పోతున్నట్టు కాదు! ఇదే నిజమైతే.. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కరోజూ ఈ విషయాన్ని ఆయన బయట పెట్టలేదు. పైగా అధికారం ఉంది కాబట్టి చర్యలు కూడా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు షర్మిల తనపైకి విమర్శలు రువ్వుతున్న సమయంలో అనూహ్యంగా దీనిని బయట పెట్టడం వెనుక.. పరోక్షంగా షర్మిలను రెచ్చగొట్టే ప్లాన్ కనిపిస్తోంది.
అంటే.. తనపై కాదు.. టీడీపీపై విమర్శలు చేయాలన్న యాంగిల్‌ను ఆయన బయట తీస్తున్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఆది నుంచి కూడా టీడీపీతో చేతులు కలిపారంటూ.. సొంత సోదరిపై విమర్శలు చేస్తున్న జగన్.. ఇప్పుడు ఈ వీడియోను బయటకు తీసుకురావడం ద్వారా.. షర్మిల-టీడీపీపై విమర్శలు చేయాలని.. ముఖ్యంగా బాలయ్యను టార్గెట్ చేయడం ద్వారా.. తను సేఫ్ అయ్యే ప్లాన్ చేశారన్నది వీరు చెబుతున్న మాట. మరి షర్మిల జగన్ వ్యూహంలో చిక్కుకుంటారా ? లేదా? అనేది చూడాలి.