ఛాన్సులు క్యూ కడతాయనుకుంటే కరువైపోయాయి
నటి అదితిరావు హైదరి గురించి ఎవరికీ ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమ్మడు తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసింది;

నటి అదితిరావు హైదరి గురించి ఎవరికీ ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమ్మడు తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసింది. అదితి తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలు. సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అదితి ఆ తర్వాత వి, మహా సముద్రం లాంటి సినిమాల్లో నటించింది.
రీసెంట్ గా అదితి రావు హైదరి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో హీరామండి: ది డైమ్ండ్ బజార్ లో ఛాన్స్ రావడం, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో అవకాశం అనగానే ఇంకో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకున్నానని చెప్పింది అదితి.
హీరామండి సిరీస్‌లో బిబ్బోజాన్‌గా నటించిన అదితి ఆ సిరీస్ ద్వారా సోషల్ మీడియాలో చాలా బాగా ఫేమస్ అయింది. ఆ సిరీస్ లో ఆమె గజగామిని వాకింగ్ నెట్టిటం ఎంత వైరల్ అయిందో తెలిసిందే. హీరామండి సిరీస్ తర్వాత వరుస ఆఫర్లు తన చుట్టుముడతాయనుకుంటే ఆ సిరీస్ తర్వాత తనకు అసలు ఛాన్సులే రావట్లేదంటోంది అదితి.
హీరామండి సిరీస్ లోని తన పాత్రను, తనను ఆడియన్స్ ఎంతగానో ఆదరించారని చెప్తున్న అదితి, ఆ సిరీస్ తర్వాత నటిగా వరుస ఛాన్సులతో బిజీ అవుతాననుకుంటే వరుస ఛాన్సులు కాదు కదా అసలు ఛాన్సులే రావడం లేదంటోంది అదితి. ఆ సిరీస్ తర్వాత తనకు ఎలాంటి అవకాశాలు రాలేదని, ఎలాగూ సినిమా ఛాన్సులు లేక బ్రేక్ లోనే ఉన్నా కదా అని పెళ్లి చేసుకున్నట్టు అదితి వెల్లడించింది. అలా అని సినిమా ఛాన్సుల్లేక తాను పెళ్లి చేసుకోలేదని, కెరీర్ లో బ్రేక్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందామని ముందు నుంచే తను ప్లాన్ చేసుకున్నట్లు అదితి తెలిపింది.
ఎలాగో ఫ్రీ టైమ్ దొరికింది కదా అని సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్నానని చెప్తున్న అదితి, సిద్ధార్థ్ ఎంతో మంచి వాడని, పెళ్లి గురించి అడిగినప్పుడు ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఓకే చెప్పానని చెప్పింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోయే ఓ ప్రాజెక్టులో భాగం కానున్న అదితి ఈ సినిమాలో అవినాష్ తివారితో కలిసి నటించనుంది.