AI ఫేక్ కంటెంట్ పై కేంద్రం కొరడా!
ముఖ్యంగా సెలబ్రిటీలకి సంబందించిన డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీని ద్వారా లభించి కంటెంట్ ప్రజలకి ఎంత ఉపయోగపడుతుందో అదే స్థాయిలో దుర్వినియోగం కూడా అవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో నడిచే యాప్స్, వెబ్ సైట్స్ విపరీతంగా డిజిటల్ స్పేస్ లోకి వచ్చేశాయి. వీటిని ఉపయోగించి కొంతమంది ఫోటోలు మార్ఫింగ్ చేయడం, వీడియోలు మార్ఫింగ్ చేయడం వంటి తప్పుడు పనులు చేస్తున్నారు.
ముఖ్యంగా సెలబ్రిటీలకి సంబందించిన డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో ఇప్పుడు ఇది మరింత ఈజీ అయిపొయింది. వేరొకరి పేస్ ఉన్న వీడియోని తీసుకొని దాంట్లో ఉన్న విమెన్ కి హీరోయిన్స్ పేస్ ని AI సహాయంతో డీప్ ఫేక్ లో తయారు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఆ వీడియోలు చూసిన వారు ఎవరైనా నిజంగానే ఆ సెలబ్రిటీ అని నమ్మేస్తారు. అంత పెర్ఫెక్ట్ గా డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున సెలబ్రిటీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రష్మికకి అండగా నిలబడి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో చేసే డీప్ ఫేక్ వీడియోలపై కఠిన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.
తాజాగా దీనిపై సెంట్రల్ ఐటీ మినిస్టర్ స్పందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66లోని సెక్షన్ అనుసరించి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసేవారికి మూడేళ్ళ జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. 24 గంటల్లో కృత్రిమంగా తయారు చేసిన కంటెంట్ ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
ఈ యాక్ట్ ప్రకారం నేరం రుజువైతే మూడేళ్ళ జైలు శిక్షతో పాటుగా లక్ష రూపాయిల వరకు జరీమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే రష్మిక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రష్మిక వీడియో గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉండగానే సైబర్ కేటుగాళ్ళు కత్రినా కైఫ్ డీప్ ఫేక్ వీడియో కూడా మార్ఫింగ్ చేసి షేర్ చేయడం గమనార్హం.