షాకింగ్... వాయు కాలుష్యం వల్ల ఇన్ని మరణాలా?
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ప్రమాధకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత ప్రమాధకర స్థాయికి చేరిన పరిస్థితి.
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ప్రమాధకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత ప్రమాధకర స్థాయికి చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ ప్రజల ఊపిరితిత్తులు కచ్చితంగా ఎంతో కొంత నాశనం అయ్యి ఉంటాయంటూ పరిశోధకులు చెబుతున్నారు! ఈ సమయంలో వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య షాకింగ్ గా ఉంది.
అవును... వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల ఆరోగ్యంపై ఇప్పటికే ఈ సమస్య తీవ్ర ఇబ్బందులు కలిగించి ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో.. ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించిన వాయు కాలిష్యం వల్ల సంభవిస్తోన్న మరణాలు, ఇతర నష్టాల వివరాలు తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... ది లాన్సెట్ జర్నల్ తాజా అధ్యయనంలో కీలా విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా.. వేగంగా పుంజుకుంటున్న పారిశ్రామికీకరణతో పాటు కార్చిచ్చు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వందల ఎకరాల్లో అడవులు దహనం అవుతుండటం పెను సమస్యగా మారిందని అంటున్నారు.
దీని వల్ల ప్రతీ ఏటా 15 లక్షల మంది మృత్యువత పడుతున్నట్లు ది లాన్సెట్ జర్నల్ అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో... 2000-2019 మధ్య ఈ కార్చిచ్చు గాలి కాలుష్యంతో ఏటా 4,50,000 మంది గుండె జబ్బులతో, మరో 2,20,000 శ్వాస సంబంధిత సమస్యలతో మృత్యువాతపడ్డారని వెల్లడించింది.
ఒక్క ఆఫ్రికాలోనే 40 శాతం మరణాలు నమోదయ్యాయని తెలిపీంది. అయితే... ఈ మరణాల్లో 90శాతం మంది పేద, మధ్యతరహా ఆదాయం ఉండే దేశాల్లోనే చోటు చేసుకున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో... ప్రధానంగా చైనా, కాంగో, భారత్, ఇండోనేషియా, నైజీరియాలలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో ఉన్నాయని తెలిపింది.
పైగా... రానున్న రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు.. ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.