కొత్త టెక్నాలజీ... చనిపోయాక కూడా ప్రియమైన వారితో మాట్లాడవచ్చు!?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కాలంలో కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కాలంలో కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఇక ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఓ టెక్నాలజీ సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఈ కృత్రిమ మేధ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల సంచలనాలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో... ఏఐ సాయంతో చనిపోయాక కూడా మాట్లాడొచ్చంటున్నారు!
అవును... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఇప్పుడు సుమారు అన్ని రంగాల్లోనూ ఏఐ ప్రవేశించి హల్ చల్ చేస్తోంది. ఈ సమయంలోనే ఓ షాకింగ్ సమాచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చనిపోయిన వారితో కనెక్ట్ కాగలరని చెబుతున్నారు!!
మీడియా నివేదికల ప్రకారం... చనిపోయిన వ్యక్తితో మాట్లాడటం సాధ్యమేనా? అనే ప్రశ్నకు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ షెర్రీ టర్కిల్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా... తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తో... కృత్రిమ మేధస్సు సహాయంతో, చనిపోయిన వారితో కమ్యునికేట్ చేయడం సాధ్యమవుతుందని అన్నారు!
ఇదే సమయంలో... "ప్రాజెక్ట్ డిసెంబర్" సహాయంతో మరణించిన వారితో కమ్యునికేట్ చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. దీని ప్రకారం... న్యూయార్క్ లో నివసిస్తున్న క్రిస్టీ ఏంజెల్... ఇటీవల అంటువ్యాధితో మరణించిన తన స్నేహితుడు కామెరూన్ తో కమ్యునికేట్ చేసిందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా క్రీస్టియన్ కూడా ఈ స్నేహితుడితోనే కమ్యునికేట్ చేయాలని అనుకుంటున్నాడని చెబుతున్నారు.