అమిత్ షా కెపాసిటి ఎంత అనేది తెలిసే టైం వచ్చింది!

అయితే తన బాధ్యతల్లో కేంద్రమంత్రి సక్సెస్ అవుతారా ? అన్నదే అనుమానంగా తయారైంది. ఎందుకంటే పార్టీలో ఒకపుడున్న జోష్ ఇపుడు ఎక్కడా కనబడటంలేదు.

Update: 2023-10-09 16:30 GMT

ఈనెల 10వ తేదీ అంటే మంగళవారం కేంద్ర హోంశాఖ అమిత్ షా తెలంగాణాకు వస్తున్నారు. 10వ తేదీన మధ్యాహ్నం ఆదిలాబాద్ లో బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 3-4 గంటల మధ్య బహిరంగసభ చూసుకుని తిరిగి హైదరాబాద్ లోని హోటల్ కు చేరుకుంటారు. హోటల్లోనే ముఖ్యనేతలు, మేథావులతో సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశం తర్వాత తిరిగి ఢిల్లీకి వెళిపోతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో పార్టీని గెలిపించే బాధ్యతంతా అమిత్ షా మీదే ఉంది.

అయితే తన బాధ్యతల్లో కేంద్రమంత్రి సక్సెస్ అవుతారా ? అన్నదే అనుమానంగా తయారైంది. ఎందుకంటే పార్టీలో ఒకపుడున్న జోష్ ఇపుడు ఎక్కడా కనబడటంలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అన్నంత జోష్ ఉండేది కమలనాదుల్లో. అలాంటిది ఇపుడు సీనియర్లలో ఎవరూ ఆమాట చెప్పటంలేదు. కారణం ఏమిటంటే ఢిల్లీ పెద్దలే బీజేపీ నెత్తిన పెద్ద బండవేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణా బీజేపీ మీద పెద్ద ప్రభావం చూపినట్లు అర్ధమవుతోంది.

స్కామ్ లో కల్వకుంట్ల కవిత పాత్ర చాలా కీలకమని ఈడీ చాలాసార్లు చెప్పింది. స్కామ్ లో పాతరదారుల్లో చాలామందిని అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం వదిలిపెట్టేసింది. నరేంద్రమోడీ-కేసీయార్ మధ్య జరిగిన లోపాయికారీ ఒప్పందం కారణంగానే ఈడీ కవితను అరెస్టుచేయలేదని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్లో నిజముందని జనాలు కూడా ఏకీభవించారు. దీన్ని అడ్డంపెట్టుకుని బీజేపీకి ఓట్లేస్తే బీఆర్ఎస్ కు ఓట్లేసినట్లే అని కాంగ్రెస్ నేతలు విపరీతమైన ప్రచారం చేశారు.

దాంతోనే బీజేపీ గ్రాఫ్ పడిపోవటం మొదలైంది. ఇదే సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ గెలవటం కూడా తెలంగాణా నేతల్లో జోష్ పెంచేసింది. ఇలాంటి అనేక కారణాలతో కాంగ్రెస్ బాగా పుంజుకుని బీజేపీ డౌన్ అయిపోయింది. ఇలాంటి పార్టీని గెలిపించే బాధ్యత అమిత్ షా నెత్తిన పడింది. ఇక్కడే అమిత్ షా కెపాసిటి బయటపడుతుంది. చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేని పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News