మీకు ఈ ''మనీ డిస్మోర్ఫియా" ఉందా?... ఇవే లక్షణాలట!!

ఈ విషయంలో చిన్న ఉద్యోగి, పెద్ద ఉద్యోగి అనే తారతమ్యాలేమీ ఉండనవేది ఎక్కువ మంది చెప్పే మాట

Update: 2024-08-01 15:30 GMT

ఎవరి జీతం ఎంతైనా.. సగటు ఉద్యోగికి నెలాఖరు వచ్చిందంటే సమస్యలు, జీతం వచ్చిందంటే కాస్త హుషారు, అనంతరం రాబోయే ఖర్చుల గురించిన టెన్షన్ ప్రతీ నెలా చివరి, తర్వాతనెల మొదటి వారాల్లో అత్యంత కామన్ అనే అనుకోవాలి. ఈ విషయంలో చిన్న ఉద్యోగి, పెద్ద ఉద్యోగి అనే తారతమ్యాలేమీ ఉండనవేది ఎక్కువ మంది చెప్పే మాట. కారణం... ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత గాలికి అంత టెన్షన్!!

అవును... ఇటీవల కాలంలో రాబోయే ఖర్చులను ఊహించుకు ఎక్కువగా టెన్షన్ పడేవారి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా... 1997 - 2012 మధ్య జన్మించిన (జెన్ - జెడ్) వారిలో ఈ తరహా తీవ్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ విషయంలో వీరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనే.. మనీ డిస్మోర్ఫియా అని అంటున్నారు!

వాస్తవానికి కోవిడ్ కి ముందు చాలా మందిలో ఈ తరహా ఆర్థిక పరమైన ఆందోళనలు ఈ స్థాయిలో లేవని అంటున్నారు. అయితే కోవిడ్ అనంతరం మారిన పరిస్థితులు, ఆలోచనా విధానంతో భవిష్యత్తులో రాబోయే ఖర్చుల కోసం ఇప్పటి నుంచే టెన్షన్ పడటం మొదలైందని అంటున్నారు. ఇలా ప్రతీ వ్యక్తి దైనందిన జీవితంలో ఎదుర్కొనే మెజారిటీ సమస్యలు ఆర్థిక పరమైనవేనని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఇక కొత్తగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో... కొంతమందికి రోజువారీ ఖర్చులకు సరిపడా ఆదాయం ఉన్నప్పటికీ... రాబోయే రోజుల్లో.. లేదా, ముందు ముందు ఎలాంటి ఖర్చులు వస్తాయో ఏమో అనే తరహా ఆందోళనలు పెరుగుతున్నాయని గట్టిగా చెబుతున్నారు.

అయితే నేటి యంగ్ జనరేషన్ లో ఈ తరహా ఆందోళనలు తలెత్తడంలో సోషల్ మీడియా పాత్రనూ హైలెట్ చేస్తున్నారు పరిశీలకులు. ప్రధానంగా ఇతరులతో కంపేరిజన్ కి ఈ ఫ్లాంట్ ఫాంస్ కారణాలవుతున్నాయని.. ఎవరినో చూసి వారిలా బ్రతకాలనే ఆలోచనలు తలెత్తడంతోనే ఈ తరహా ఆందోళనలు రావడానికి ఒక కారణం ఏర్పడుతుందని చెబుతున్నారు!

ఈ విషయాలపై స్పందించిన ఫైనాన్షియల్ థెరపిస్ట్ అమండా క్లేమాన్... డబ్బుకు సంబంధించిన ఆందోళన, అప్రమత్తత, అభద్రతా భావంతో కూడిన అంతర్గత భావన వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇదే సమయంలో... తమ చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరూ సంపన్నమైన జీవితాన్ని కలిగి ఉంటారని ఊహించుకోవడం కూడా ఈ తరహా సమస్యకు కారణమని స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News