అమరావతిలో ఒక్క తెలంగాణా సచివాలయం లాంటి బిల్డింగ్ కడతారా ?
ఒక విధంగా చెప్పాలీ అంటే హైదరాబాద్ కి ఇపుడు విజిటింగ్ ప్లేస్ గా ఈ సచివాలయం మారింది అని అంటున్నారు.
హైదరాబాద్ కి తలమానికంగా కొత్తగా కట్టిన సచివాలయముంది. దానిని అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే హైదరాబాద్ కి ఇపుడు విజిటింగ్ ప్లేస్ గా ఈ సచివాలయం మారింది అని అంటున్నారు.
వీకెండ్ వచ్చిందంటే చాలు కొత్త సచివాలయం వద్ద ఉన్న ప్లేస్ లో జన జాతరగా కనిపిస్తోంది. అలా జనమంతా అక్కడికి తరలి వస్తూ దానికి ఒక కీలకమైన టూరిస్ట్ స్పాట్ గా చేశారు. దీంతో అక్కడ వీధి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి.
ఇక అక్కడ ఉన్న అమరవీరుల స్థూపం ఫ్లై ఓవర్ నుంచి సెల్ఫీలు తీసుకుంటూ జనం సందడి చేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా బిజీ టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మాణం అంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది.
ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్లేస్ ని బాగానే మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే ఏపీలో చూస్తే 2014లో గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అలాంటి ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు అని అంటున్నారు. అమరావతి రాజధాని అని చెప్పినా కేవలం టెంపరరీ బిల్డింగ్స్ నే కట్టారు.
ఆ పైన అమరావతి స్వయం సమృద్ధిగా ఎదిగే నగరం అని చెబుతూ వస్తున్నారు కానీ ఇప్పటిదాకా ఆ రూపు రేఖలు అయితే ఏ కోశానా కనిపించడంలేదు అని అంటున్నారు. 2019లో జగన్ గెలిచాక అమరావతినే అసలు తలచుకోలేదు. పైగా మూడు రాజధానులు అంటూ టైం పాస్ చేసారు.
తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అమరావతినే రాజధాని అని ఫైనల్ చేసేశారు. జనం తీర్పు కూడా అలాగే వచ్చింది. అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇక మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే అమరావతి ప్రాజెక్ట్ అన్నది లక్ష కోట్ల పై మాట అని దానికి రెండు మూడేళ్ళ సమయం పడుతుందని చెబుతున్నారు అంటునారు.
ఇక చంద్రబాబు అయితే జగన్ అంత అమరావతిని నాశనం చేశారని ఇక తాను ఎక్కడ నుంచి మొదలుపెట్టాలీ అని అంటున్నారు. ఇక అమరావతి రాజధాని విషయంలో కేంద్రం సాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మోడీ ఏమీ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కేవలం మాటల వరకే అని అంటున్నారు.
ఔటర్ రింగ్ రోడు కి కేంద్రం మంజూరు చేసినా అది ప్రభుత్వం డబ్బు అయితే కాదు, పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని తెచ్చి ఆ తరువాత టోల్ గేట్ తో డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తారు. అలాంటి ప్రాజెక్ట్ నే అమరావతికి మోడీ ఇస్తారని అంటున్నారు.
ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వానికి కూడా డబ్బులు వస్తాయి కాబట్టి. ఇక బ్యాంకర్లు ప్రైవేట్ ఇన్వెస్టర్లు అమరావతి రాజధాని కోసం పెట్టుబడులు పెట్టాలీ అంటే అసలు అమరావతి రాజధాని అక్కడే ఉంటుందా గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. అమరావతే మన రాజధాని అని చట్టం చేస్తామని చెప్పినా ఇన్వెస్టర్లు నమ్మే పరిస్థితి లేదు అని అంటున్నారు.
రాజకీయాల్లో ఏదీ పర్మనెంట్ కాదు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అని ప్రైవేట్ ఇన్వెస్టర్లు అంటున్నారుట. ఇవన్నీ ఎందుకు అని రాష్ట్ర ప్రభుత్వమే నిధులు తెచ్చి అమరావతి రాజధాని నిర్మాణం కోసం సర్దుబాటు చేయాలీ అంటే సంక్షేమ పధకాలు మొత్తం ఆపేయాల్సి ఉంటుంది. నిధుల కొరత కూడా పట్టి పీడిస్తోంది అని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం దగ్గర అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్న ఉండనే ఉంది. తెలంగాణాకు అయితే హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజన్ ఉంది కూడా రుణ మాఫీకి అవసరం అయిన 31 వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేనపుడు ఆస్తులు తనఖా పెట్టారని అంటున్నారు.
కోర్ క్యాపిటల్ కట్టాలీ అంటే కనీసం అయిదు వేల కోట్ల రూపాయలు ఉండాలని అంటున్నారు. సచివాలయం అసెంబ్లీ వంటివి కట్టాలీ అంటే తెలంగాణా కంటే గొప్పగా కట్టాల్సి ఉంటుంది. చంద్రబాబు అంటే అభివృద్ధికి మారు పేరు అన్న ఇమేజ్ ఉంది. అలా తన మార్క్ ని బాబు చూపించాలి అంటే పీపీపీ మోడల్ లో అయితే చేయవచ్చు.
కానీ ఇన్వెస్టర్లు నమ్మడం లేదు అని అంటున్నారు. మరి ఈ రకమైన పరిస్థితుల మధ్య బాబు తన మార్క్ చూపిస్తారా లేకపోతే ఇలా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారా అన్న చర్చ సాగుతోంది. నిజంగా చూస్తే కనుక అమరావతి అన్నది ఏపీకి ఇపుడున్న పరిస్థితుల్లో బిగ్ ప్రాజెక్ట్. దానిని సాకారం చేయకపోతే మాత్రం అయిదు కోట్ల మంది ప్రజలు తీవ్ర నిరాశలో కూరుకుపోవడం ఖాయమని అంటున్నారు.