టీడీపీ పక్కా వ్యూహం : డిప్యూటీ సీఎం అంటే లోకేష్ బాబే !

టీడీపీ కూటమిలో చంద్రబాబు సీఎం. ఆయనే ప్రభుత్వ అధినేత అయితే రెండవ ప్లేస్ ఎవరిది అన్న దాని మీద కొంతకాలంగా అంతర్గతంగా చర్చగా సాగుతూ వస్తోంది.

Update: 2025-01-19 14:30 GMT

టీడీపీ కూటమిలో చంద్రబాబు సీఎం. ఆయనే ప్రభుత్వ అధినేత అయితే రెండవ ప్లేస్ ఎవరిది అన్న దాని మీద కొంతకాలంగా అంతర్గతంగా చర్చగా సాగుతూ వస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన సెకండ్ ప్లేస్ లో ఉంటారు అని అనుకోవడం సహజం. దానికి తగినట్లుగానే బాబు తరువాత అత్యంత గౌరవం ప్రోటోకాల్ వంటివి పవన్ కి దక్కుతోంది.

ఆయన ఎక్కడికి వెళ్ళినా డీసీఎం హోదాలో అధికార మర్యాదలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీలో కీలకంగా ఉంటూ ప్రభుత్వంలో కూడా తన ప్రాధాన్యతను చాటుకుంటూ వస్తున్న నారా లోకేష్ కదా బాబుకు అసలైన వారసుడు అన్నది తమ్ముళ్ల మాటగా ఉంది. బాబు తరువాత వినిపించాల్సింది లోకేష్ బాబు పేరు కదా అని కూడా వారిలో గట్టిగా ఉంది.

ఇక చూసుకుంటే కనుక పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో జోరు చేస్తున్నారు. దాంతో తమ్ముళ్లలో కూడా కొత్త రకం సందేహాలు వస్తున్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. అందుకే లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం గా చేయండి అని డిమాండ్ వస్తోంది. ఇది మెల్లగానే వస్తూ ఇపుడు పీక్స్ కి చేరుతోంది అని అంటున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ ఆల్మోస్ట్ తమ్ముళ్ళు ఫిక్స్ అయిపోయారు.

ఆయనే మా డిప్యూటీ సీఎం అని కూడా బాహాటంగానే చెబుతున్నారు. నిన్నటికి నిన్న కడపకు చెందిన టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాస్ రెడ్డి లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం గా చేయమని సభా ముఖ్యంగానే చంద్రబాబుని ఆయన సమక్షంలోనే కోరారు.

ఇక దానికి మద్దతు అన్నట్లుగా సీనియర్ మోస్ట్ లీడర్ టీడీపీలో అనేక సార్లు మంత్రిగా ఉన్న నేత అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అందుకున్నారు. శ్రీనివాసరెడ్డి అన్నదాంట్లో తప్పేమీ లేదని ఆయన ఫపోర్టు ఇచ్చారు. లోకేష్ బాబు వైసీపీ హయాంలో ఎదురొడ్డి పోరాడారు, యువగళం పేరుతో ఏపీ అంతటా తిరిగారు. ఆయన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు దాంతో లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కావాల్సిందే అని అంటున్నారు.

లోకేష్ బాబు నాయకత్వ పటిమను చూసి టీడీపీ శ్రేణులతో పాటు ఏపీ జనాలు మొత్తం జై కొట్టారని ఆయన గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అన్ని అర్హతలు ఉన్న లోకేష్ పేరుని డిప్యూటీ సీఈం గా పరిశీలించాలని ఆయన తెలుగుదేశం అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇలా టీడీపీలో సీనియర్ నేతలు అంతా వరసగా డిప్యూటీ సీఎం గా లోకేష్ కి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చూడబోతే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారనుందా అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి టీడీపీలో బాబు తరువాత లోకేష్ ఉంటారు. అందులో డౌటే లేదు. కానీ కూటమి ప్రభుత్వం కావడంతో బాబు తరువాత పవన్ ఎలివేట్ అవుతున్నారు.

అది సహజంగా టీడీపీ శ్రేణులకు అంతనా నచ్చడం లేదు అని అంటున్నారు. అందుకే మా లోకేష్ డిప్యూటీ సీఎం కాబోయే సీఎం అని అంటున్నారు. దాంతో లోకేష్ కి ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఒక విధంగా ఇది టీడీపీ మైండ్ గేం గానూ అంటున్న వారు ఉన్నారు. నిజానికి ఈ తరహా డిమాండ్ ని మొదట చేసింది మహాసేన రాజేష్. ఆయన లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయమని కోరారు ఆ మీదట ఇపుడు వరసబెట్టి డిమాండ్లు వచ్చిపడుతున్నాయి.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి అయింది. చూస్తే కనుక చంద్రబాబు తరువాత పవన్ అన్నది మెల్లగా జనంలోకి పోతోంది. లోకేష్ ఎక్కడా పెద్దగా ఎలివేట్ కావడం లేదు అన్నది కూడా ఉంది. దాంతోనే ఒక్కసారిగా ఈ డిమాండ్ వచ్చింది అని అంటున్నారు.

లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఇపుడు టీడీపీ తీసుకుని రావడం వెనక పక్కా వ్యూహం ఉంది అని అంటున్నారు. అధికారం ఇంకా చేతిలో నాలుగున్నరేళ్ళ పాటు ఉంది. దాంతో ఇపుడే లోకేష్ ని డిప్యూటీగా చేస్తే కూటమి పక్షాలు కూడా ఎవరూ మాట్లాడేది ఉండదని అంటున్నారు. ఒక వేళ ఏమైనా ఇబ్బందులు ఉన్నా సర్దుకునేందుకు చాలా సమయం ఉంది అని అంటున్నారు. అందుకే ఈ డిమాండ్ తెర మీదకు వచ్చింది అని అంటున్నారు. సో టీడీపీ పక్కా వ్యూహంలోనే లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా తెర మీదకు వస్తున్నారు అని భావించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News