ఒక్క మాటలో పిఠాపురం వర్మ షాకిచ్చేశారా ?

ఏపీలో ఇపుడు హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఏంటి అంటే నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ ఇవ్వడం అన్న దాని మీద.

Update: 2025-01-19 15:29 GMT

ఏపీలో ఇపుడు హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఏంటి అంటే నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ ఇవ్వడం అన్న దాని మీద. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయమని ఒక కాంపెయిన్ మాదిరిగా టీడీపీలో సీనియర్ నేతల నుంచి డిమాండ్ వచ్చిపడుతోంది. కడప గడపలో తొలిసారిగా టీడీపీ తమ్ముడు పొలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాసరెడ్డి ఈ డిమాండ్ ని ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే వినిపించారు.

దానిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలపరచారు. ఇక ఇపుడు పిఠాపురం వర్మ వంతు అంటున్నారు. ఆయన లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసి తీరాల్సిందే అని అంటున్నారు. ఈ మేరకు ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. కోటి సభ్యత్వాలు టీడీపీ చరిత్రలో ఒక రికార్డు. దానిని సాధించి చూపించిన నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిందే అని స్పష్టం చేశారు.

టీడీపీకి భవిష్యత్తు లేదు అన్న వారికి యువగళం పాదయాత్రతో గట్టి జవాబు చెప్పిన ఘనత లోకేష్ దని అన్నారు. పార్టీ క్యాడర్ అంతా అదే కోరుకుంటోందని ఆయన అంటున్నారు. ఏ పార్టీకైనా మనోభావాలు ఉంటాయని దీని మీద కొన్ని సోషల్ మీడియా చానళ్ళు మీడియా చానళ్ళు వక్ర భాష్యాలు తీయడం సరికాదు అని వర్మ అంటున్నారు.

లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకుంటోందని ఇందులో తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. దారుణంగా ఓటమి పాలు అయినా జగన్ ని సీఎం అంటున్నారని అలాగే జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ ని ఆ పార్టీ వారు సీఎం అని అంటున్నారని మరి టీడీపీ కోసం ఎంతో కష్టపడుతున్న లోకేష్ కి డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేసి బాధ్యతలు ఇస్తే అందులో తప్పు ఎక్కడ ఉందని ఆయన అంటున్నారు.

కరడు కట్టిన టీడీపీ కార్యకర్తగా తాను లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇది తన మాట కాదు మొత్తం పార్టీ మాట అని అన్నారు. చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయాన్ని శిరసా వహిస్తాను అని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే లోకేష్ కి మద్దతు ఇస్తూనే పిఠాపురం వర్మ వ్యూహాత్మకంగా జనసేన మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారా అన్న చర్చ సాగుతోంది. లేకపోతే ఆయన పవన్ ని సీఎం అని జనసేన క్యాడర్ అంటోంది అని ప్రస్తావించడం ఎందుకు అని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షం కాబట్టి ఆయన మీద కామెంట్స్ చేసినా చేయవచ్చు కానీ మధ్యలో పవన్ ఊసు ఎందుకు అన్నది కూడా చర్చ సాగుతోంది.

అయితే పిఠాపురంలో వర్మకు ప్రాధాన్యత తగ్గిపోవడం తో ఆయన చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. దాంతో పాటుగా వైసీపీ నుంచి కొంతమందిని కోరి తెచ్చి మరీ జనసేనలో చేర్చుకుని వర్మ బలాన్ని నిర్వీర్యం చేయడానికి లోకల్ జనసేన లీడర్స్ చూస్తున్నారని అంటున్నారు.

ఇలా పిఠాపురం రాజకీయాలో కింగ్ లా ఒకనాడు ఉన్న వర్మ ఇపుడు జనసేన రాజకీయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపధ్యంలో లోకేష్ డిప్యూటీ సీఎం అన్న డిమాండ్ తో ఆయన ముందుకు వచ్చారు పనిలో పనిగా ఇండైరెక్ట్ గా జనసేన మీద కామెంట్స్ చేశారు అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు లోకేష్ బాబుల అండతో రాజకీయంగా ఐదిగిన వర్మ లోకేష్ చలవతో పూర్వ వైభవాన్ని అందుకోవచ్చు అని ఆరాటపడుతున్నారని అంటున్నారు. దాంతో ఆయన ఈ విధంగా షాకిచ్చేలా స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు.

Tags:    

Similar News