పిట్టల రెట్టలు..కాలుష్యం మధ్య టోర్నీనా? డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్

వానాకాలం.. ఎండా కాలం.. చలికాలం.. సీజన్ ఏదైనా దేశ రాజధాని ఢిల్లీ అంటేనే ఎక్ట్రీమ్ వెదర్.. అక్కడ అన్నీ ఎక్కువే అన్నట్లు.. వర్షాలు ముంచెత్తుతాయి.. చలి వణికిస్తుంది.. ఎండలు మాడ్చేస్తాయి.

Update: 2025-01-19 16:30 GMT

వానాకాలం.. ఎండా కాలం.. చలికాలం.. సీజన్ ఏదైనా దేశ రాజధాని ఢిల్లీ అంటేనే ఎక్ట్రీమ్ వెదర్.. అక్కడ అన్నీ ఎక్కువే అన్నట్లు.. వర్షాలు ముంచెత్తుతాయి.. చలి వణికిస్తుంది.. ఎండలు మాడ్చేస్తాయి. వీటికితోడు వాయు కాలుష్యం. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీల్లో పంట వ్యర్థాల దహనం కారణంగా వచ్చే పొగ ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. దీంతో దేశ రాజధాని తరచూ వాయు కాలుష్యంతో వార్తల్లో నిలుస్తుంటుంది.

తాజాగా మూడు రోజుల కిందట కూడా ఢిల్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కింది. అక్కడ వాయు నాణ్యత తీవ్రస్థాయికి పడిపోయింది. దీంతో తక్షణమే కఠిన నిబంధనలు అమలుకు ‘ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌’ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-4 ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మంగళవారం 275, బుధవారం 396గా నమోదైంది.

ఈసారి పంట వ్యర్థాలు కాదు..

ఈసారి ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణం పంట వ్యర్థాలు కాదు.. దట్టమైన పొగమంచు, కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గాలి నాణ్యత పడిపోయింది.

బ్యాడ్మింటన్ టోర్నీపై దెబ్బ

ఢిల్లీ వాయు కాలుష్యం ప్రభావం బ్యాడ్మింటన్ టోర్నీపై పడింది. ఢిల్లీలో ప్రస్తుతం ఇండియా ఓపెన్ టోర్నీ జరుగుతోంది. ఇందులో డెన్మార్క్ క్రీడాకారిణి బ్లిచ్ ఫెల్ట్ పాల్గొన్నారు. అయితే, వాయు కాలుష్యం, పిట్టల రెట్టల మధ్య తాను ప్రాక్టీస్ చేయలేకపోయానని ఆమె చెప్పారు. వరుసగా రెండో ఏడాది కూడా అనారోగ్యానికి గురైనట్లు వాపోయారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. బ్లిచ్ ఫెల్ట్ రెండో రౌండ్ లోనే ఓడిపోయి టోర్నీమెంట్ నుంచి నిష్క్రమించారు. బ్లిచ్ ఫెల్ట్ ఆరోపణలపై స్పందించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ).. టోర్నీ నిర్వహణకు ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తామని తెలిపింది.

కాగా డెన్మార్క్ చాలా పరిశుభ్రమైన, ప్రశాంతమైన దేశం. అక్కడినుంచి వచ్చిన ఆటగాళ్లకు ఢిల్లీ వంటి వాతావరణం కాస్త ఇబ్బందికరమే.

Tags:    

Similar News