దోశలేసి.. టీ కాచి.. మంత్రి అంబటి ఎన్నికల స్టంట్
ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వైసీపీ నాయకుడు, కాపు నేత, మంత్రి అంబటి రాంబాబుకు ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం వైసీపీలో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గెలుస్తారు అనుకున్నవారి విషయాన్ని పక్కన పెట్టిన సీఎం జగన్.. గెలుపుపై నమ్మకం లేని వారిని అసంతృప్త నేతల సెగ ఉన్నవారిని ఆయన వేరే వేరే నియోజకవర్గాలకు తరలిస్తున్నారు. ఈ జాబితాలో మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే..ఆ యనకు టికెట్ కన్ఫర్మ్ చేయకముందే.. ఆయన రంగంలోకి దిగిపోయారు. ఎన్నికల ప్రచారా న్ని ప్రారంభించేశారు. సత్తెనపల్లిలో బుధవారం ఉదయం ఆయన పర్యటించారు. ఈ సందర్భం గా స్థానిక ఐదు లాంతర్ల సెంటర్ లోని ఓ షాపులో `టీ మాస్టర్` అవతారం ఎత్తి స్వయంగా టీ తయారు చేశారు. అలాగే, మరో టిఫిన్ షాపులో దోశలు వేశారు. స్థానిక ప్రజలు, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతా కలియతిరిగి ప్రభుత్వ పథకాలు, పొందిన లబ్ధిని అందరికీ వివరించారు.
ఇప్పటివరకు నేను నా పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైందని. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మార్పులు తప్ప.. ఇంఛార్జీలే అభ్యర్థులుగా ఉంటారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని.. రానున్న రోజుల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలి? ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి? అన్న దానిపై సుదీర్ఘ సమావేశంలో శ్రేణులకు నిర్దేశించారు.
ఈ క్రమంలో జగన్ వ్యూహాలకు అనుగుణంగా పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వారితో మమేకమవుతూ సమస్యలు తెలుసు కుంటున్నారు.ఈ నేపథ్యంలో అంబటి వారు కొత్త స్టంట్‌కు తెరదీశారని.. ఆయన అసమ్మతి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ముందు తమ సమస్యలు పరిష్కరించాలని.. తమపై పెట్టించిన కేసులను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.