బిగ్ బ్రేకింగ్... పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ!
నిన్నటివరకూ రాజకీయాలకు దూరం అన్నట్లుగా ప్రకటించిన రాయుడు... అన్యూహంగా పవన్ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది!
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఇటీవల వైఎస్సార్సీపీలో జాయిన్ అవ్వడం, అనంతరం ఆరురోజుల్లోనే పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరిగిన నేపథ్యంలో... తర్వాత రాజీనామాకు క్రికెట్ మ్యాచులు ఉండటమే కారణం అని ఆన్ లైన్ వేదికగా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా అంబటి రాయుడు పవన్ తో భేటీ అవ్వడం రాజకీయంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది.
అవును... ఇటీవల వైసీపీకి రాజీనామా చేస్తూ.. జనవరి 20నుంచి దుబాయ్ లో జరగబోతున్న ఐ.ఎల్.టి20లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్న కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన అంబటి తిరుపతి రాయుడు తాజాగా పవన్ తో భేటీ అయ్యారు! నిన్నటివరకూ రాజకీయాలకు దూరం అన్నట్లుగా ప్రకటించిన రాయుడు... అన్యూహంగా పవన్ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది!
దీంతో "జనసేన లోకి అంబటి రాయుడు" అనే కథనాలు మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే సమయంలో ఆయన జనసేనలో ఎందుకు చేరారనే విషయం కంటే... వైసీపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది! దీనివెనుకున్న అసలు కారణాలేమిటనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో గుంటూరు లోక్ సభ స్థానం అనే సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి!
ఈ సమయంలో ఆయన మరికాసేపట్లో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారని తెలుస్తుంది. దీంతో... అంబటి తిరుపతి రాయుడికి వైసీపీ ఇవ్వలేని ఆ హామీ ఏమిటి.. ఏ హామీ ఇచ్చి జనసేన రాయుడికి కన్విన్స్ చేసింది అనేది తెలియాల్సి ఉంది! ఈ విషయంపై అంబటి రాయుడు క్లారిటీ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.
కాగా.. అంబటి తిరుపతి రాయుడు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ విషయం జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే! అంబటికి ఆరు రోజుల్లోనే విషయం అర్ధమైందని, కాళ్లపారాణి ఆరకముందే, తదనంతర కార్యక్రమాలేవీ జరగకముందే బయటపడటం అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం రాబోయే వారం పదిరోజుల్లో టీడీపీలో కానీ జనసేనలోకానీ చేరతారనే ఆశాభావం ఆయన అభిమానుల్లో ఉందని చెప్పుకొచ్చారు!