హలో ఏమైపోయావు బ్రో... మొదలుపెట్టిన అంబటి!
"హలో... ఏమైపోయావ్ బ్రో! బాబు గారు బొక్కలోకి పోతానంటున్నాడు. వచ్చి... పలకరించి, పులకరించి... పో" అంటూ అంబటి రాంబాబు తాజాగా ఒక ట్వీట్ చేశారు.
ప్రస్తుతం చంద్రబాబుకు ఐటీ నోటీసులు.. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ టీడీపీ అధినేత చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పైగా, ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించకపోవడం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో అంబటి రాంబాబు ఎంటరయ్యారు.
చంద్రబాబు కు ఐటీ నోటీసులు ఇవ్వడం.. పేదల కోసం ప్రభుత్వం కడుతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారని కథనాలొస్తున్న నేపథ్యంలో.. అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఏపీ మంత్రి అంబటి ఆన్ లైన్ వే దికగా స్పందించారు.
"బ్రో" సినిమాలో తనను పోలిన పాత్ర శ్యాంబాబు ను సృష్టించి పవన్ కల్యాన్ శునకానందం పొందారన్నస్థాయిలో విమర్శలు గుప్పించిన అంబటి రాంబాబు... గతకొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో పవన్ యాక్టివ్ గా లేరనే విషయాన్ని గ్రహించినట్లుగా కామెంట్ చేశారు! ఇందులో భాగంగా... ట్విట్టర్ లో "హలో... బ్రో" అంటూ పలకరించారు.
"హలో... ఏమైపోయావ్ బ్రో! బాబు గారు బొక్కలోకి పోతానంటున్నాడు. వచ్చి... పలకరించి, పులకరించి... పో" అంటూ అంబటి రాంబాబు తాజాగా ఒక ట్వీట్ చేశారు. దీంతో... అంబటి మళ్లీ మొదలుపెట్టారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
కాగా... ఐటీ నోటీసులు - అరెస్టులపై చంద్రబాబు చేసిన కామెంట్లపైనా అంబటి రాంబాబు స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి ఆయనకు భయమేస్తుందని అంబటి చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేస్తున్నట్లు ఆయనకు కలవచ్చినట్టుంది అంటూ సెటైర్ విసిరారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్నా కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పరని.. వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిదని అంబటి వ్యాఖ్యానించారు.