ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంతమందిని పంపేసిన అగ్రరాజ్యం

అగ్రరాజ్యం తన దేశంలో అక్రమంగా ఉండే వారిని వెతికి వెతికి మరీ వారిని వారి దేశాలకు పంపుతోంది.

Update: 2024-10-27 12:30 GMT

అగ్రరాజ్యం తన దేశంలో అక్రమంగా ఉండే వారిని వెతికి వెతికి మరీ వారిని వారి దేశాలకు పంపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అక్రమంగా ఉంటున్న విదేశీయుల్ని ప్రత్యేక విమానాల్లో తిరిగి పంపేస్తున్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. అక్రమ వలసదారుల్ని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్న యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తాము పంపేసిన విదేశీయుల వివరాల్ని వెల్లడించింది.

ఈ విదేశీయుల్లో భారతీయులు కూడా భారీగానే ఉన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం కూడా తమకు సహకరిస్తున్నట్లు అమెరికా చెబుతోంది. చట్టబద్ధత లేకుండా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.6 లక్షల మందిని పంపినట్లుగా పేర్కొంది. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

అక్రమంగావలస ఉంటున్న విదేశీయుల్ని గుర్తించిన అమెరికా అధికారులు 495 ప్రత్యేక విమానాల్లో భారీగా విదేశీయుల్ని వారి దేశాలకు పంపేశారు. ఇలా అక్రమంగా వచ్చిన విదేశీయులు దాదాపు 145 దేశాలకు చెందిన వారున్నట్లు వెల్లడైంది. అక్రమంగా వలస ఉంటున్నవారిలో భారత్.. కొలంబియా.. ఈక్వెడార్.. పెరూ.. ఈజిప్టు.. మారిటానియా.. సెనెగల్.. ఉబ్బెకిస్థాన్.. చైనా దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. అమెరికా చేపట్టిన ఈ చర్యల కారణంగా అమెరికా నైరుతి సరిహద్దుల్లో అనధికారిక వలసలు 55 శాతం తగ్గినట్లుగా చెబుతున్నారు.అక్రమ వలసల్ని నియంత్రించటం ద్వారా చట్టబద్ధమైన వలస మార్గాల్ని ప్రోత్సహించుకోవటానికేనని.. తన చర్యల్ని అగ్రరాజ్యం సమర్థించుకుంది.

Tags:    

Similar News