తండ్రీకొడుకులిద్ద‌రు 10 అపార్ట్ మెంట్ల‌పై పెట్టుబ‌డి!

తాజాగా అమితాచ్చ‌న్-అభిషేక్ బ‌చ్చ‌న్ క‌లిపి 10 అపార్ట్ మెంట్ల‌ను కొనుగోలు చేసారు.

Update: 2024-10-25 07:30 GMT

రాజుగారు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? అన్న‌ట్లు అమితాబ‌చ్చ‌న్ త‌లుచుకుంటే డ‌బ్బుకు క‌రువా! ఒక సినిమాకి సైన్ చేస్తే కోట్ల‌లో అడ్వాన్స్ వ‌చ్చి ప‌డుతుంది. ఒక యాడ్ చేసినా అంతే మొత్తం ఛార్జ్ చేస్తుంటారు. ఇవి గాక టీవీ షోలు...వ్యాపారాల ద్వారా ఏడాది సంపాద‌న కోట్లలో ఉంటుంది. అలాంటి అమితాబ‌చ్చ‌న్ అపార్ట్ మెంట్లు... ప్లాట్లు కొన‌డానికి ఎందుకు ఆలోచిస్తారు. ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబ‌డులు పెట్టారు.


కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా న‌టుడిగా బాగానే సంపాదిస్తున్నాడు. తండ్రి న‌ట వార‌త‌స్వాన్ని పుణికి పుచ్చికుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు గానీ తండ్రి స్థాయిలో ఎద‌గ‌లేక‌పోయాడు. అయిన వ‌చ్చిన అవ‌కాశాల‌తో బాగానే సంపాది స్తున్నాడు. ఇలా తండ్రీకోడుకులు వార్షిక ఆదాయం క‌లిపితే భారీ మొత్తంలోనే ఉంటుంది. పెట్టుబ‌డులు ఎవ‌రికి వారు కొన్ని పెట్టుకోగా..ఇద్ద‌రు భాగ‌స్వామ్యంలో కూడా కొన్ని పెట్టుబ‌డులున్నాయి.

తాజాగా అమితాచ్చ‌న్-అభిషేక్ బ‌చ్చ‌న్ క‌లిపి 10 అపార్ట్ మెంట్ల‌ను కొనుగోలు చేసారు. ముంబైలోని ములుండ్ వెస్ట్‌లో 24.95 కోట్లతో ఈ 10 అపార్ట్ మెంట్లను కొన్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లు ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో భాగం. 3 బీహెచ్ కె , 4 బీహెచ్ కే ప్లాట్లుగా తెలుస్తోంది. వీటిలో అభిషేక్ బచ్చన్ ఆరింటిని 14.77 కోట్లకు కొనుగోలు చేయగా, మిగిలిన నాలుగింటిని అమితాబ్ బచ్చన్ సొంతం చేసుకున్నారు.

వీరిద్ద‌రు ఈ ఏడాది రియల్ ఎస్టేట్‌లో 100 కోట్ల ఆస్తుల్ని కొనుగోలు చేసారు. ఓషివారా , మగథనే (బోరివాలి ఈస్ట్)లోఈ ఆస్తులున్న‌ట్తు తెలుస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ప్ర‌త్యేకంగా 10,000 చదరపు అడుగుల స్థలాన్ని కూడా దాదాపు రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేశారు. దీనిని అభినందన్ లోధా హౌస్ అభివృద్ధి చేసింది. అంతేకాదు బచ్చన్ ఫ్యామిలీ ఆఫీస్ IPO-బౌండ్ ఫుడ్ డెలివరీ, శీఘ్ర-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్విగ్గిలో చిన్న పాటి వాట‌లాను కూడా కైవసం చేసుకున్నారు. ఉద్యోగులు , ప్రారంభ పెట్టుబడిదారుల నుండి షేర్లను కొనుగోలు చేయడం ద్వారా కార్పొరేట్ రంగంలో వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు.

Tags:    

Similar News