కడపలో లోక్ సభ స్థానంలో షర్మిళ పరిస్థితి ఇదేనా?

ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడప లోక్ సభ స్థానంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

Update: 2024-05-14 07:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. పలు అవాంఛనీయ సంఘటనలూ జరిగాయి. ఏది ఏమైనా.. ఎక్కడా రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఆ సంగతి అలా ఉంటే... ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన లోక్ సభ స్థానాల్లో ఒకటైన కడపలో పోలింగ్ సరళిపై ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో అత్యంత రసవత్తరంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళి నేపథ్యంలో గెలుపోటములపై విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడప లోక్ సభ స్థానంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా.. క‌డ‌ప లోక్ సభ నియోజకవర్గంలోని ఓటింగ్ స‌ర‌ళిని గ‌మ‌నిస్తే.. కొంతమేర క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని చెబుతున్నారు. ప్రధానంగా... క‌డ‌ప‌, ప్రొద్దుటూరు, పులివెందుల‌, జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌కవ‌ర్గాల్లో కొంత వ‌ర‌కు క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని స‌మాచారం. ఇందులో భాగంగా... రెండు మూడుశాతం ముస్లింల ఓట్లు కూడా కాంగ్రెస్‌ కు పడ్డాయని అంటున్నారు.

అయితే ఈ క్రాస్ ఓటింగ్ ష‌ర్మిల‌కు కలిసొస్తుందా.. ఈ ఎన్నికల్లో ఆమెను గట్టెక్కిస్తుందా అంటే మాత్రం.. లేద‌నే స‌మాధానం వ‌స్తోందని తెలుస్తోంది! ఇదే సమయంలో కొంత వరకూ క్రాస్ ఓటింగ్ జరిగిన మాట వాస్తవమే కానీ.. ఆ కొద్దిపాటి క్రాస్ ఓటింగ్ వైసీపీ విజయాన్ని ఆపలేదనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ క్రాస్ ఓటింగ్ కి ప్రధానంగా రెండు కారణాలని అంటున్నారు.

ఇందులో భాగంగా... స్వయంగా టీడీపీ నేతలే ఎంపీ ఓటు షర్మిళకు వేయమన్నారనేది ఒకటికాగా... షర్మిళపై సానుకూలత వల్ల కాకపోయినా అవినాష్ పై వ్యతిరేకతతోనూ ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్నారు. అనినాష్ పై కోపంగా ఉన్న పలువురు వైసీపీ కార్యకర్తలకు షర్మిళ ప్రయామ్నాయం అయ్యారని అంటున్నారు. అయితే అది గెలుపును అందించేస్థాయిలో కాకపోవచ్చని చెబుతున్నారు!

కాగా... 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి 7,83,499 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి 4,02,773 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News