సినిమాల్లో వక్రీకరణలు చూసి సిగ్గు పడుతున్నా! అనంత్ శ్రీరామ్
సినిమాల్లో హైందవ దర్మంపై దాడి జరుగుతోందని ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
సినిమాల్లో హైందవ దర్మంపై దాడి జరుగుతోందని ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి పరిధిలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం బహిరంగ లో అనంత శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. సినిమాల కోసం పురాణలకు వక్రీకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు. హైందవ ధర్మం హననం జరుగుతోందని మండిపడ్డారు. `కల్కీ` సినిమాలో కర్ణుడి పాత్రను హైలైట్ చేసారు.
కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఈ వక్రీకరణలు చూసి సిగ్గు పడుతున్నాని అసహనం వ్యక్తం చేసారు. తప్పును తప్పు అని కచ్చితంగా ఖండించాల్సిందేనన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ` బ్రహ్మాండ నాయకుడు అన్నపదం ఉందని నేను...లేదని మరో దర్శకుడు పట్టుబట్టడంతో అతడికి పాటలు రాయడం మానే సాను. `లక్ష్యం` సినిమాకు 12 నిమిషాల హిందూ పాటను రాసాను.
అలాంటి సినిమాలకు మళ్లీ అలాంటి పాటలు రాయాలని ఉందన్నారు. హిందు ధర్మాన్ని హననం చేసే సినిమా లను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. అలాంటి సినిమాలకు మనం వెళ్లకపోతే డబ్బులు రావు. అప్పుడు వాళ్లు ఆ తరహా సినిమాలు తీయడం మానేస్తారు. సత్యవాణిని అభినవ ద్రౌపదిగా వర్ణించారు. మరి ఇది ఒప్పుకుంటారా? ధర్మరాజు అంత దాత అని కర్ణుడిని అంటే ఊరుకుంటారా? ఇస్కాన్ హరే కృష్ణ హరేకృష్ణ ను ఐటం సాగ్ చేసారు.
`పీకే` సినిమాలో రాయి మీద పాన్ ఉమ్మి దేవుడన్నారు. మరి ఊరుకుంటారా? అక్రమ్ హుస్సేన్ గోపికలను బట్టలు లేకుండా చూపిస్తే ఊరుకుంటారా? ఇలా ఇన్ని విధాలుగా హననం చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా? లేచి తిరగబడతారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.