అనిత నోట సూసైడ్ మాట... ట్రోలింగ్స్ పై హోంమంత్రి స్వానుభవం..!
పలు అధికారిక అకౌంట్స్ కూడా ఇలాంటి పనులకు వేదికలవుతుండటం అత్యంత నీచమనే మాటలూ వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికలుగా నాయకులపై తప్పుడు ప్రచారాలు చేయాడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వారి కుటుంబంలోని మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన, నీచమైన, తప్పుడు పోస్టులు పెడుతుండటం ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే. పలు అధికారిక అకౌంట్స్ కూడా ఇలాంటి పనులకు వేదికలవుతుండటం అత్యంత నీచమనే మాటలూ వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో తన బిడ్డలకు ఎదురైన అనుభవాన్ని పవన్ కల్యాణ్ ఇటీవల పంచుకుని, ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ మహిళా నేతలూ ఇవే వ్యాఖ్యలు చేసేవారు. తమ ఆవేదనను వెల్లడించేవారు. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి అనిత ఈ విషయంపై స్పందించారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల తాను ఎంతగా ఆవేదన చెందిందీ, ఎంత మానసికంగా కృంగిపోయిందీ వెల్లడించారు!
అవును... ఏపీలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు, నీచ ప్రచారాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి తన కుటుంబ సభ్యులు కూడా బాధితులు అని పవన్ కల్యాణ్ చెప్పడంతో మేటర్ మరీ సీరియస్ అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత... సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన, నీచమైన పోస్టులు పెట్టేవారిని వదిలే ప్రసక్తి లేదని.. సప్తసముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి చత్యలు తీసుకుంటామని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఈ మేరకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారని అనిత తెలిపారు.
తనపై సోషల్ మీడియలో ట్రోలింగ్స్ చూసి ఎంతో బాధపడేదాన్నని హోంమంత్రి అనిత తెలిపారు. ఆ సమయంలో బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదని.. లేదంటే ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్నని అన్నారు. అయితే... తాను గట్టిదాన్నని, అందుకే చలించలేదని.. మానసికంగా బలహీనంగా ఉంటే అంతే సంగతులని.. ఆత్మహత్యే శరణ్యం అని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ ను అనుకోకుండా కలిసినట్లు చెప్పిన హోంమంత్రి అనిత... ఈ వ్యవహారలపై కొన్ని సలహాలు ఇచ్చారని, తాము ఏమి చేస్తున్నామో ఆయనకు చెప్పినట్లు తెలిపారు.