అయ్యో.. అన్నామలై!
బీజేపీ కీలకనాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై.. పరిస్థితి దారుణంగా తయారైంది.
బీజేపీ కీలకనాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై.. పరిస్థితి దారుణంగా తయారైంది. తమిళనా డులోని కీలకమైన కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజే పీని నిలబెట్టేందుకు ఎంతో ప్రయత్నించారు. పాదయాత్రలు చేశారు. అసలు ఏమీ లేని స్థానం నుంచి బీజేపీ ని పుంజుకునేలా చేశారు. ఇలాంటి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఒకింత బాగానే ఉన్నా.. కోయంబ త్తూరులో మాత్రం దారుణంగా తయారైంది.
కోయంబత్తూరు నియోజకవర్గంలో అన్నామలై పోటీ చేశారు. ఇక్కడ ఆయనకు కేంద్రంలోని పెద్దలు పెద్ద అభయం కూడా ఇచ్చారు. అన్నామలైని గెలిపిస్తే.. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ నిర్వహించిన రోడ్ షోలో ప్రకటించారు. నిజానికి ఎక్కడా కూడా ప్రధాని ఈ మేరకు హామీ ఇవ్వలేదు. కానీ, ఆయన హామీ గుప్పించారు. దీనికి కారణం.. అన్నామలైని గెలిపించుకో వాలనే ఉత్సాహమే. మరి ఇక్కడ జరిగిన పోలింగ్ అలానే జరిగిందా? అంటే ప్రశ్నగానే మారింది.
ఎందుకంటే... అన్నామలై పోటీ చేసిన.. కోయంబత్తూరులో పోలింగ్సమయంలోనే.. ఆయనకు వ్యతిరేకత వచ్చేసింది. దీంతో ఒక పోలింగ్ కేంద్రంలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అయినప్పటికీ.. కేంద్రంలో ని పెద్దలు ఆయనను ఊరడించారు. ఇక, ఇప్పుడు వస్తున్న ట్రెండును గమనిస్తే.. అన్నామలై పరిస్థితి దారుణంగా మారింది. ఎందుకంటే.. ఒక పోలింగ్ బూత్‌లో ఒకే ఒక్క ఓటు పడింది. ఇది మరింతగా ఆయనను కుంగదీసింది. ఇక, గెలుపుపై దాదాపు ఆయన ఆశలు వదిలేసుకున్నారు.