20 రోజులు ముందుగానే... ఏపీలో ఎన్నికల ముహూర్తం ఖరారు!

అవును... ఏపీలో ఎన్నికలకు కాస్త తొందరగానే ముహూర్తం ఖరారు అవ్వొచ్చని తెలుస్తుంది. మరోపక్క ఈసారి ఎప్పడూ లేనంత ఉత్కంఠ కలిగిస్తున్నాయి.

Update: 2023-12-20 09:36 GMT

తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టీ పడింది! ఈ సమయంలో అటు అధికార వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు.. విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నిర్ణీత షెడ్యూల్ కంటే కనీసం 20 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఇవే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.

అవును... ఏపీలో ఎన్నికలకు కాస్త తొందరగానే ముహూర్తం ఖరారు అవ్వొచ్చని తెలుస్తుంది. మరోపక్క ఈసారి ఎప్పడూ లేనంత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనన్ని సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో... అధికార వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

తన ప్రభుత్వ పాలనలో లబ్ధి చేకూరిన కుటుంబాలు మాత్రమే ఓటు వేయండి అన్న స్థాయిలో జగన్ పిలుపునివ్వడం కీలకంగా మారింది. ఇది పాజిటివ్ ఓటు బ్యాంకు లక్ష్యంగా ఇస్తున్న స్టేట్ మెంట్ అని అంటున్నారు. అటు వైసీపీ మంత్రులూ, నేతలూ కూడా... తన పాలనలో లబ్ధి చేకూరితేనే తనకు ఓటు వేయండి అనే స్థాయిలో జగన్ పిలుపునివ్వడం చరిత్రలో తొలిసారి అని అంటున్నారు పరిశీలకులు.

మరోపక్క ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. అదే తమకు కలిసి వస్తుందని.. ఇదే సమయంలో పొత్తులు కూడా సామాజిక సమీకరణాల నేపథ్యంలో తమకు ప్లస్ అవుతాయని చంద్రబాబు, పవన్ లు నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఇందులో భాగంగా... నిర్ణీత షెడ్యూల్ కంటే 20 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని తెలుస్తోంది.

వాస్తవానికి గతంలో ఉన్న సమాచారం మేరకు ఏపీలో ఫిబ్రవరి 15-20 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరింత అప్రమత్తమైన అధికార పార్టీ... ఏపీలో బోగస్ ఓట్ల పై ఫిర్యాదులు చేసింది. దీంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తుంది. ఈ సమయలో గతంలో కంటే కాస్త ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని అంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో మార్చి 3న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ దఫా... ఫిబ్రవరి 10-15 మధ్యన విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ సమయంలో జనవరి నెలాఖరు నాటికి అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు పూర్తి చేయటానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా... సంక్రాంతి తర్వాత ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకోవడం తథ్యం అని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News