ఏపీలో ఏప్రిల్ లో ఎన్నికలు...!

దాంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఏడెనిమిది దశలలో లోక్ సభ ఎన్నికలు ఈసారి ఉండబోతున్నాయి.;

Update: 2023-12-15 03:51 GMT

ఏపీలో ఎన్నికలు ఎపుడు అన్న పెద్ద డౌట్ ఉంది. ముందస్తు వెనకస్తు అంటూ చాలా ప్రచారం జరిగింది. విపక్షాలు రేపో మాపో ఎన్నికలు అంటూంటే అధికార వైసీపీ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంటూ వచ్చింది. ఇపుడు వైసీపీ మాటే నిజం కాబోతోంది. లోక్ సభకు ఏపీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.


దాంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఏడెనిమిది దశలలో లోక్ సభ ఎన్నికలు ఈసారి ఉండబోతున్నాయి. ఏపీలో మొదటి దశలో పోలింగ్ అన్నది 2019లో నిర్వహించారు. ఆనాడు చంద్రబాబు కాంగ్రెస్ కూటమితో సన్నిహితంగా ఉన్నారు.

దాంతో ఏపీనే ముందు పెట్టి ఎన్నికలు పెట్టారని ఒక ప్రచారం సాగింది. ఈసారి జగన్ ఏపీ సీఎం గా ఉన్నారు. పైగా ఒడిషాకు కూడా లోక్ సభతో పాటే ఎన్నికలు ఉంటాయి. మరి ఈసారి సౌత్ నుంచి తొలిదశ మొదలెడతారా లేక నార్త్ నుంచి వస్తూ మధ్య దశలలో ఏపీ ఉంచుతారా అన్నది చూడాల్సి ఉంది.

అయితే అంతకు ముందు ఎన్నికలు చూసుకున్నా మొదటి రెండు దశలలోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీలో ఏప్రిల్ లో మొదటి రెండు దశలలో ఎన్నికలు జరగడం ఖాయం.

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ విధంగా స్పష్టమైన సంకేతాలు ఉండబట్టే ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల ముందు జరగాల్సిన ఇంటర్ టెంత్ పరీక్షలు ముందుకు జరిపించి మొత్తం పరీక్షల ప్రక్రియను మార్చి నెలాఖరుతో పూర్తి చేస్తోంది అని అంటున్నారు.

ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మీడియాకు చెప్పారు. సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపధ్యంలోనే పరీక్షలను కాస్తా ముందుగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఏప్రిల్ లో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయి. కానీ ఈసారి వాటిని ముందుకు జరిపారు. ఇక తొమ్మిది దాకా పరీక్షలను కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు మొత్తం సిద్ధం చేస్తారు అని అంటున్నారు.

పోలింగ్ స్టేషన్లుగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలే వాడుకుంటారు కాబట్టి ఈ ముందస్తు ఏర్పాట్లు అని అంటున్నారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాలు కూడా మార్చిలోనే నిర్వహించి ఓటాను అకౌంట్ తో ముగిస్తారు అని అంటున్నారు. డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు జరుపుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

అది కనుక లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలే ఈ టెర్మ్ లో చివరికి అవుతాయని అంటున్నారు. ముఖ్యమైన బిల్లుల ఆమోదం ఏమైనా ఉంటే మాత్రం వింటర్ సెషన్ ఉంటుంది అని అది కూడా అయిదారు రోజుల పాటు ఉండవచ్చు అని కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఏప్రిల్ లో ఎన్నికలు ఖాయం అని అంటున్నారు.

Tags:    

Similar News