వైసీపీ ఎఫెక్ట్: వీటిని మరిచిపోవాల్సిందే.. !
ఇదొక్కటే కాదు.. తమకు ఏ పత్రాలు అవసరమైనా.. ఏ సమస్య వచ్చినా.. పొరుగున ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లే పరిస్థితి ఇక నుంచి ఉండదు.
ఏపీ ప్రజలు కొన్ని కొన్ని విషయాలను ఇక మరిచిపోవాల్సిందేనా? ఏ సమస్య వచ్చినా.. వెంటనే ఫోన్ తీసి.. తమ పరిధిలోని వలంటీర్‌కు చెప్పుకొనే వెసులు బాటును, సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను కూడా మరిచిపోవాల్సిందేనా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇదొక్కటే కాదు.. తమకు ఏ పత్రాలు అవసరమైనా.. ఏ సమస్య వచ్చినా.. పొరుగున ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లే పరిస్థితి ఇక నుంచి ఉండదు.
ఏ అవసరం వచ్చినా.. తమ తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందేనని కూడా చెబుతు న్నారు. దీనికి కారణం.. జగన్ హయాంలో తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రస్తుత కూటమి ప్రభు త్వం పక్కన పెట్టేసింది. దీని వెనుక సీఎం చంద్రబాబు లేకపోవచ్చు.. కానీ, కూటమి పార్టీలకు కూడా ఈ రెండు అంశాలు నచ్చడం లేదని తెలుస్తోంది. వలంటీర్లను, గ్రామ, వార్డు సచివాలయాలను కొనసాగించడం.. కూటమిలోని ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది.
2019, అక్టోబరులో జగన్ వలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చారు. ఇవి రెండు కూడా ప్రజల కు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేశాయి. అంతేకాదు.. రాజకీయాలకు అతీతంగా.. తమకు ఏ చిన్న సమస్య వచ్చినా.. వెంటనే వలంటీర్లకు ఫోన్లు చేయడం, ఏ పత్రం కావాలన్నా (బర్త్, డెత్ సహా కులద్రువీకరణ పత్రాలు ) గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లేవారు. ఒక్కొక్కసారి వలంటీర్లకే చెప్పేవారు. దీంతో ఆయా పనులు అయిపోయేవి. ఇక, పింఛన్లు, ఇతర పథకాలకు కూడా.. నాయకులతో సంబంధం లేకుండా వలంటీర్ల ద్వారా లబ్ధి పొందిన సందర్భాలు ఉన్నాయి.
అయితే.. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేయాలని.. కూటమి పార్టీలు సహా టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు పట్టుబడుతున్నారు. దీనికి కారణం.. ప్రజలకు - తమకు మధ్య ఉండే రాజకీయ సంబంధం తెగిపోతుందని.. దీంతో ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దీనికి వైసీపీనే వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎంత చేసినా.. ప్రజలకు-నాయకులకు మధ్య సంబంధాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. కాబట్టి ఈ రెండు వ్యవస్థలను పక్కన పెట్టాలనేదివారి సూచన. దీంతో చంద్రబాబు ప్రస్తుతానికైతే ఆలోచనలో పడ్డారు. కానీ, కొనసాగడం మాత్రంకుదిరేలా లేదు.