జనసేన జెండాలు తక్కువగా ఉన్నాయ్ లోకేశ్?

ఈ విషయంలో లోకేశ్ కొన్ని కీలకాంశాల్ని మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

Update: 2024-02-11 11:59 GMT

రాజకీయ ప్రత్యర్థి శక్తివంతుడైనప్పుడు.. తెలివైనోడైనప్పుడు వేసే ప్రతి అడుగు ఆచితూచి అన్నట్లుగా వేయటమే కాదు.. మాట్లాడే మాట మొదలు అన్ని అంశాలపైనా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న విషయానికి చిలువలు పలువలు చేసి ప్రచారం చేసే సత్తా ప్రత్యర్థులకు ఉన్నప్పుడు.. ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వానికి ఉండాలి. ఈ విషయంలో లోకేశ్ కొన్ని కీలకాంశాల్ని మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురంలో ఆదివారం శంఖారావం పేరుతో నలబై రోజుల యాత్రకు శ్రీకారం చుట్టారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. ఇలాంటివేళలో.. పొత్తులో భాగంగా తాము కలిసి తిరగాల్సిన జనసేన ప్రాతినిధ్యం తన సభల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరేం జరిగిందో కానీ.. లోకేశ్ శంఖారావం సభల్లో జనసేన జెండాలు పరిమితంగానే కనిపించాయి. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శంఖారావం సభల్లో జనసేన పార్టీ ప్రాతినిధ్యంపై కసరత్తును మిస్ అయినట్లుగా చెబుతున్నారు.

మొదటిరోజు లోపాన్ని గమనించినట్లుగా తెలుస్తోంది. కొన్ని మీడియాల్లో చూపించినట్లుగా జనసేన జెండా అన్నది శంఖారావం సభలో కనిపించలేదన్న మాటలో నిజం లేదంటున్నారు. పరిమితంగా జనసేన జెండాలు ఎగిరాయని.. ఆ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. తన ప్రసంగంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావన లోకేశ్ తెచ్చినప్పటికి.. మరింత ఎక్కువ ప్రస్తావించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న రీతిలో పరిస్థితి లేదని.. లోకేశ్ శంఖారావానికి జనసేన కార్యకర్తలు స్వచ్చందంగా హాజరైనట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. టీడీపీ పసుపు జెండాలతో పాటు జనసేన జెండాల ఊపు మరింత పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News