అంటే రేవంత్ కంటే, భ‌ట్టి తోపు అన్నమాట

అయితే, ఇటీవ‌లి కాలంలో సీఎం మార్పు ఉంటుంద‌ని, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క పేరు సీరియ‌స్‌గా పరిశీలనలో ఉందని వార్తలు రావడం సంచలనంగా మారింది.

Update: 2024-11-24 17:30 GMT

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థానాన్ని పదిల‌పరుచుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వ అధినేతగా కూడా ఆయన తన ముద్ర వేసుకుంటున్నారు, పట్టు సాధిస్తున్నారు. అయితే, ఇటీవ‌లి కాలంలో సీఎం మార్పు ఉంటుంద‌ని, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క పేరు సీరియ‌స్‌గా పరిశీలనలో ఉందని వార్తలు రావడం సంచలనంగా మారింది. ఈ ప్రచారంతో సంబంధం లేనప్పటికినీ, ఊహించని పరిణామం మాత్రం ఈ కామెంట్ కి కనెక్ట్ అవుతుండ‌టం గమనార్హం!

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని నిర్ణ‌యించేదిగా నిలిచిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యంత పేల‌వమైన ప్రదర్శన కనబరిచి, బీజేపీ నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారం చేజిక్కుంచుకుంది. అంతేకాకుండా చేతి గుర్తు పార్టీ చ‌తికిల ప‌డిపోగా బీజేపీ సొంతంగా పెద్ద ఎత్తున బలపడింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల కంటే ఘోరంగా కాంగ్రెస్ గ్రాఫ్‌ దిగజారిపోయింది. అయితే, ఈ పరిణామం ఊహించ‌ని రీతిలో రేవంత్ రెడ్డికి ముడిపెట్టబ‌డుతోంది!!

మహారాష్ట్ర తో పాటుగా ఎన్నికలు జరిగినా మరో రాష్ట్రమైన జార్ఖండ్‌లో కాంగ్రెస్ మిత్ర పక్షమైన జేఎంఎం గెలుపొందింది, తిరిగి అధికారం సొంతం చేసుకుంది. అయితే, ఎన్నిక‌లు జ‌రిగిన ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న మరో ముఖ్యమైన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపోవటములే కాకుండా ఆ పార్టీ కోసం ప్రచారం చేసిన నేతలు సైతం. కాంగ్రెస్ కోసం మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం చేయగా, జార్ఖండ్‌లో హస్తం గుర్తు కోసం బట్టి క్యాంపెయిన్‌ నిర్వహించారు.

కట్ చేస్తే ఫలితాల తర్వాత కాంగ్రెస్ మహారాష్ట్రలో ఘోర పరాజయం మూట కట్టుకోవడం, ఝార్ఖండ్‌లో అధికారం సొంతం చేసుకోవడం నేపథ్యంలో భట్టి హ్యాండ్ లక్కీ హ్యాండ్ గా మారిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. రేవంత్ సభలకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారని, చాలా ఆదరణ దక్కిందని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నప్పటికీ, ఆయన ప్రచారం చేసిన ఏ ఒక్కచోటా కాంగ్రెస్ గెల‌వ‌లేదని గుర్తు చేస్తున్నారు. అయితే, భ‌ట్టి విషయంలో మాత్రం కాంగ్రెస్‌ విజయం సాధించిందని ఇంకా పార్టీ కూట‌మే అధికారంలోకి వచ్చిందని వివరిస్తున్నారు. కాబట్టి రేవంత్ కంటే మట్టి తోపు అని ఆయ‌న అనుచ‌రులు ప్ర‌చారం చేసేస్తున్నారు.

Tags:    

Similar News