టీటీడీ రేసులోకి వాళ్లిద్దరూ !

అయితే తాజాగా మరో రెండు పేర్లు చేరాయి. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక గజపతి రాజు, మాజీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్ లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

Update: 2024-07-10 06:56 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే రాజకీయ నాయకులు అందరికీ ఎంతో ప్రీతి. వైసీపీ హయాంలో రెండోసారి టీటీడీ చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓటమితో తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో తదుపరి చైర్మన్ ఎవరు అన్నదానిపై అనేక ఊహాగానాలు బయటకు వచ్చాయి.

 

ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులుగా టీటీడీ నూతన చైర్మన్ బరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ పేర్లతో పాటు ఒక న్యూస్ ఛానల్ యజమాని పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో రెండు పేర్లు చేరాయి. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక గజపతి రాజు, మాజీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్ లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

ప్రముఖ సినీనటుడు అయిన మురళీ మోహన్ 2009లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. 2014 ఎన్నికల్లో లక్ష 70 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు. ఇక 1978 నుండి రాజకీయాల్లో ఉన్న అశోక గజపతి రాజు టీడీపీ ప్రభుత్వంలో అనేక సార్లు రాష్ట్ర మంత్రిగా, 2014లో ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా పనిచేశారు. ఇద్దరూ బిగ్ షాట్ లే కావడంతో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచిచూడాలి.

Tags:    

Similar News