ఆ గ్రామంలో వింత ఆచారం... మహిళలు దుస్తులు ధరించకూడడు!
ఐదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారు! అది ఎక్కడ.. ఎందుకు.. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం!
భారతదేశంలో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటన్నింటి సమాహారమే ఈ దేశం ప్రత్యేకత! పైగా ఈ దేశంలో స్త్రీని దేవతగా చూస్తుంటారు. దేశాన్ని కూడా భారత మాత అని భావిస్తారు. అలాంటి ఈ దేశంలోని ఒక గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. అక్కడున్న మహిళలూ ఐదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారు! అది ఎక్కడ.. ఎందుకు.. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం!
అవును... హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో పిని అనే చిన్న గ్రామం ఉంది. ఆ చిన్న గ్రామానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అక్కడి మహిళలు పాటించే ఈ నగ్న ఆచారమే దానికి కారణం! ఈ ఊరు మొత్తం జనాభా 2,593 మంది. ఈ గ్రామంలో నివసించే మహిళలు సంవత్సరానికి 5 రోజులు బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలి. ఈ సంప్రదాయం శ్రావణ మాసంలో నిర్వహించబడుతుంది.. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందని చెబుతుంటారు.
వారు చెబుతున్న ఆ చరిత్ర ప్రకారం... పిని గ్రామంలో చాలా కాలం క్రితం రాక్షసులు తిరిగేవట. ఆ రాక్షసులు గ్రామంలోని మహిళల దుస్తులను చింపేసి.. తీసుకెళ్లేవారట. ఈ సమయంలో వారి నుంచి గ్రామస్తులను రక్షించేందుకు "లహువా ఘోండ్" అనే దేవత ఈ గ్రామానికి వచ్చిందట. ఆ దేవత రాక్షసులను చంపి.. పిని ప్రజలను కాపాడిందని.. భాద్రపద మాసం తొలి రోజు ఈ ఘటన జరిగిందని చెబుతారు.
దీంతో... ఆ ఐదు రోజుల దీక్షలో భాగంగా... మహిళలు తాము రోజూ కట్టుకునే బట్టలేవీ కట్టుకోరు. పూర్తిగా నగ్నంగా ఉంటారు. ఈ దీక్ష చేస్తున్న ఐదురోజులూ ఇంట్లోని భర్త, భార్య ఎవరూ కనీసం నవ్వనైనా నవ్వకూడదు. అలా నవ్వితే వారు పూజిస్తున్న దేవతకు కోపం వస్తుందని భావిస్తారు. ఏటా ఐదు రోజులపాటు ఈ వేడుకలు జరుపుతారు. ఇందులో భాగంగా ఈ నగ్న దీక్ష చేపడతారు.
ఈ వేడుకల మొదటి రోజునే వారు పూజిస్తున్న దేవత, రాక్షసుల్ని చంపేసిందట. అయినప్పటికీ ఐదు రోజులుపాటు ఈ వేడుకలు చేస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో మగవారు కూడా నిష్టగా ఉంటారు. ఇందులో భాగంగా మద్యం, మాంశాహారం ముట్టరు. ఇదే సమయంలో... ఈ ఐదు రోజులూ బయటివారెవరినీ ఆ గ్రామం వైపు రానివ్వరు.
వాస్తవానికి ఇది అత్యంత కఠిన దీక్ష అనే చెప్పాలి. ఐదు రోజులు స్త్రీలు దుస్తులు లేకుండా ఉండటం ఒకెత్తు అయితే... అక్కడి చలిని తట్టుకుని ఉండటం మరొకెత్తు! కారణం... ఈ ఊరు హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు మాత్రమే! అలాంటి చోట బట్టలు లేకుండా ఉండటం గొప్ప విషయమే!