మన్మోహన్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి వస్తారా?

నీసం తన కుటుంబం ఎవరో కూడా తెలియనంతగా సాధారణ జీవితం గడిపారు.

Update: 2024-12-28 18:30 GMT

భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.. ఒక గొప్ప ఆర్థిక నిపుణుడు నిష్క్రమించాడు.. దేశాన్ని ప్రగతి పథంలో నిలిపిన సంస్కరణ సారథి ఇక సెలవంటూ తప్పుకొన్నాడు.. ఆయనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. 92 ఏళ్ల వయసులో మన్మోహన్ జీవితాన్ని చాలించారు. దీంతో భారత రాజకీయాల్లో ఓ నిష్కళంక నేత అస్తమించినట్లయింది. కాగా, ఏ పదవిలో ఉన్నా నీతి నిజాయతీలే తన ఆభరణాలుగా వెలుగొందారు మన్మోహన్. కనీసం తన కుటుంబం ఎవరో కూడా తెలియనంతగా సాధారణ జీవితం గడిపారు. మరి.. మన్మోహన్ వారసులు ఎవరు..? అందరి నాయకుల్లాగే వారూ రాజకీయ అరంగేట్రం చేస్తారా?

రాజకీయాల్లోకి రానట్లే?

అతిపెద్ద దేశానికి ఏకధాటిగా పదేళ్లు ప్రధానిగా పనిచేయడం అంటే మామూలు మాటలు కాదు. ఆ ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కింది. మరి ఆయన వారసులు రాజకీయాల్లోకి వస్తారా? అసలు ఆయన పిల్లలు ఎవరు? పదవి నుంచి వైదొలగి పదేళ్లు దాటిన నేపథ్యంలో మన్మోహన్ కుటుంబం గురించి ఇటీవలి కాలంలో పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత మళ్లీ చర్చించుకుంటున్నారు.

ముగ్గురూ వేర్వేరు రంగాల్లో

మన్మోహన్ కు ముగ్గురు కుమార్తెలు. వీరు వివిధ రంగాల్లో రాణిస్తూ తండ్రి పేరు నిలబెడుతున్నారు. ఉపిందర్ సింగ్, తమన్ సింగ్, అమృత్ సింగ్ లు తమ రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. ఉపిందర్ అందరిలోకీ పెద్దవారు. ఆశోక్ వర్సిటీ డీన్. చరిత్రకారిణి. భారతీయ చరిత్రపై పుస్తకాలు రాశారు. ఉపిందర్ ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రంలో నిపుణుడైన విజయ్ తంఖాను వివాహం చేసుకున్నారు.

తమన్ సింగ్.. స్ట్రిక్ట్లీ పర్సనల్ అనే తన తల్లిదండ్రుల జీవిత చరిత్ర సహా అనేక పుస్తకాలు రచించారు. మిజోరంలో అటవీ సంరక్షణ వంటి సామాజిక సమస్యలపై పుస్తకాలు వెలువరించారు. డామన్ ఐపీఎస్ అధికారి, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ మాజీ సీఈవో అయిన అశోక్ పట్నాయక్‌ ను వివాహం చేసుకున్నారు.

హక్కుల న్యాయవాది

అమృత్ సింగ్ అమెరికాలో మానవ హక్కుల న్యాయవాది. స్టాన్‌ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో లా బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడానికి ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనిషియేటివ్‌ తో కలిసి పనిచేశారు. అమృత్.. యేల్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదివారు.

కాగా, వీరి ప్రొఫైల్స్ చూస్తే.. ఎవరికీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నట్లు లేదు. అయితే, కాంగ్రెస్ నాయకత్వం కోరితే దానిని స్వీకరించే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News