బ్రేకింగ్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో టీడీపీ అభ్యర్థి విజయం

ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘనవిజయం సాధించారు.;

Update: 2025-03-04 08:15 GMT

ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘనవిజయం సాధించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఏడో రౌండ్ లెక్కింపు ముగిసే సమయానికి ఆయన విజయానికి అవసరమైన 51% ఓట్లను పొందారు. దీంతో అధికారులు మరో రౌండ్ లెక్కింపు అవసరం లేకుండానే ఆయనను విజేతగా ప్రకటించారు. అనంతరం ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

- భారీ మెజారిటీతో విజయం

ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి పేరాబత్తుల రాజశేఖరం మొత్తం 1,12,331 ఓట్లు సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి దిడ్ల వీర రాఘవులకు 41,268 ఓట్లు మాత్రమే రావడంతో, కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.

మొత్తం 1,96,000 ఓట్లు లెక్కించగా, 1,78,422 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. కాగా, 17,578 ఓట్లు చెల్లనివిగా పరిగణించబడ్డాయి. ఇంకా 22,000 ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది.

రౌండ్ వారీగా ఓట్ల గణాంకాలు

రౌండ్ 1 – 16,520

రౌండ్ 2 – 16,212

రౌండ్ 3 – 16,191

రౌండ్ 4 – 15,482

రౌండ్ 5 – 15,632

రౌండ్ 6 – 16,254

రౌండ్ 7 – 16,040

పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం ఘనవిజయం సాధించడం కూటమికి కీలక విజయంగా భావిస్తున్నారు.

ఇప్పటికే ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ సీటు టీడీపీ సొంతం అవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

Tags:    

Similar News