ఇద్దరు భార్యలతో కలిసి 50 ఏళ్ల వార్షికోత్సవ వేడుక.. హైదరాబాద్ లో!
అవును.. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఒక భారీ వేడుక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేస్తోంది.;
అవును.. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఒక భారీ వేడుక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేస్తోంది. ఎందుకుంటే.. ఇలాంటి సీన్లు చాలా రేర్ గా మాత్రమే చూసే పరిస్థితి. తన ఇద్దరు భార్యలతో కలిసి యాభై ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని వేడుకలా జరుపుకోవటం ఒక ఎత్తు అయితే.. అందుకు మొత్తం కుటుంబ సభ్యులు కలిసి నిర్వహించిన వేడుక ఇస్పెషల్ గా మారింది.
బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతూ.. ఇట్టా పెళ్లి చేసుకోవటం.. అలా విడిపోవటం.. లేదంటే మానసిక వేదనతో బలవనర్మణాలకు పాల్పడటం.. కాదంటే.. కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలతో జీవిత భాగస్వామ్యుల్ని చంపేసే దుర్మార్గమైన ప్లాన్లు వేస్తున్న రోజుల్లో.. పెళ్లై 50 ఏళ్లు కలిసి ఉండటం ఒక ఎత్తు అయితే.. ఇద్దరు భార్యలతో జీవించటం మరింత ప్రత్యేకతగా చెప్పాలి.
హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం ఒట్టినాగులపల్లికి చెందిన అచ్చయ్య అనే వ్యక్తి యాభై ఏళ్ల క్రితం భారతమ్మను పెళ్లాడారు. కొద్ది రోజులకే ఆమె చెల్లెలు సుమిత్రను వివాహం చేసుకున్నారు. ఇద్దరు భార్యలతో కలిసి ఉండటం చాలా కష్టమంటారు. అందుకు భిన్నంగా ఇద్దరి అనుమతితోనే పెళ్లి చేసుకున్న ఆయన వారితో యాభై ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని సాగించటం ఆసక్తికరంగా మారింది.
వీరి కుటుంబం విషయానికి వస్తే.. భారతమ్మకు నలుగురు కుమారులు కాగా.. సుమిత్రకు ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె. పిల్లలందరికి పెళ్లిళ్లు చేశారు. బాధ్యతల్ని పూర్తిచేసుకున్నారు. వీరి పెళ్లై యాభై ఏళ్లు అయిన సందర్భంగా కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు.. స్నేహితులను ఆహ్వానించి నార్సింగిలో గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహించారు. ఈ వేడక స్థానికంగా ఇస్పెషల్ గా మారటమే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఈ జమానాలో ఇలాంటి వేడుక సమ్ థింగ్ స్పెషల్ అని మాత్రం చెప్పక తప్పదు.