సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఇదే రోజు అరెస్టై.. నేడు మంత్రిగా ప్రమాణం!
ఈ సందర్భంగా టెక్కిలి ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడూ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు అచ్చెన్న లైఫ్ లో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఏపీలో ఈ రోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విక్టరీని సాధించిన కూటమి నుంచి చంద్రబాబుతోపాటు మరో 24మంది ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా టెక్కిలి ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడూ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు అచ్చెన్న లైఫ్ లో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... ఏపీలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణం చేశారు. టెక్కిలి నియోజకవర్గంలో 2014లో 8,387 ఓట్లు, 2019లో 8,545 ఓట్ల మెజారిటీతో గెలిచిన అచ్చెన్నాయుడు... తాజాగా ఎన్నికల్లో 34,435 మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. టీడీపీలో చంద్రబాబు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కీలకనేతగా ఎదిగారు.
ఈ క్రమంలోనే 2020 అక్టోబర్ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే... 2014-19 మధ్య మంత్రిగా పనిచేసిన అచ్చెన్న.. అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది సరిగ్గా ఈ రోజే కావడం గమనార్హం. సరిగ్గా 2020లో ఇదే రోజున అచ్చెన్నను అరెస్ట్ చేశారు. అనూహ్యంగా నాలుగేళ్ల తర్వాత ఇదే రోజు ఆయన తిరిగి మంత్రిగా ప్రమాణం చేశారు.
దీంతో... ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ఆన్ లైన్ వేదికగా అచ్చెన్నపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. నాడు అరెస్ట్ కాబడిన వ్యక్తి.. ఓపికగా ఉండి ఈ రోజు మంత్రిగా మారారని.. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తుంటారని.. మంచికి ప్రకృతి కూడా సహకరిస్తుందంటే ఇదే అని.. దేవుడు స్క్రిప్ట్ ఇదని కామెంట్లు చేస్తున్నారు.
మరోపక్క... అచ్చెన్నాయుడి సోదరుడు దివంగత ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎర్రన్నాయుడి అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో ఎర్రన్నాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఇదే స్థానంలో ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే.