వైరల్... "ఓడిపోయాడే గానీ చావలేదు... డైలాగ్ బాగుంది"!

అవును... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లున్న వీడియో వైరల్ గా మారింది!

Update: 2024-06-14 10:49 GMT

ఏపీలో జరిగిన ఎన్నికలు జగన్ గెలవడం, జగన్ ఓడిపోవడం అనే రెండు అంశాలపైనే జరిగాయని.. అంతకు మించిన మరో అంశం లేదని.. ప్రధానంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్, లిక్కర్ ధరలు ఈ విషయంలో కీలక భూమిక పోషించాయని పలువురు కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒక వీడియో వైరల్ గా మారింది.

ఏపీలో జగన్ పేరుచెబితే అంతెత్తున లేచే నేతల్లో, వీలైనంత పరుష పదజాలంతో స్పందించే నేతల్లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముందుంటారని అంటుంటారు. ఈ సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన పక్కనే కుర్చున్న ఒక వ్యక్తి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లున్న వీడియో వైరల్ గా మారింది! ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి మధ్య జగన్ గురించిన సంభాషణ జరిగింది. ఇందులో భాగంగా... “ఓడిపోయాడే కానీ చావలేదని” సదరు వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఇందులో భాగంగా... “వాడు ఓడిపోయడేగానీ చావలా.. అపారమైన ధనబలం ఉంది, కుల బలం ఉంది.. పక్క ప్రభుత్వంలోనూ ఉంటారు వీడి మనుషులు.. మనదేశంలో డబ్బుకు లొంగనివాడు లేడు” అని సదరు వ్యక్తి చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. అనంతరం స్పందించిన అయ్యన్న... "అయితే లెగకుండా కొట్టాలి" అంటూ ఆ సంభాషణను కొనసాగించారు.

ఈ సందర్భంగా "ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది... ఓడిపోయాడే కాని చావలేదు" అని వ్యాఖ్యానించిన అయ్యన్న... "పాముని చచ్చేవరకూ కొట్టాలంట" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది జగన్ గురించిన సంభాషణే అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!

Full View
Tags:    

Similar News