వైసీపీతో పెట్టుకుంటే కనెక్షన్ కట్ !
దాంతో రాజకీయంగా ఓటమి చెందినా అధికారం చేతిలో లేకపోయినా చాలా మంది వైసీపీ నేతల పరిస్థితి గ్రౌండ్ లెవెల్ లో బాగానే ఉందని అంటున్నారు.
వైసీపీని బలహీనం చేయాలని కూటమి ప్రభుత్వ పెద్దలు చూస్తూంటే క్షేత్ర స్థాయిలో మాత్రం అంతా కలసి హాయి భాయ్ గా ఉంటున్నారు. ఇలా చాలా చోట్ల జరుగుతోంది. దాంతో రాజకీయంగా ఓటమి చెందినా అధికారం చేతిలో లేకపోయినా చాలా మంది వైసీపీ నేతల పరిస్థితి గ్రౌండ్ లెవెల్ లో బాగానే ఉందని అంటున్నారు.
ఈ విషయాలను టీడీపీ అధినాయకత్వం ఎప్పటికపుడు గమనిస్త్గూ చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అదే సమయంలో అలాయ్ భలాయ్ గా తిరిగే తమ్ముళ్ళ లిస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకుందని అంటున్నారు. గంగాధర నెల్లూరులో జరిగిన పార్టీ క్యాడర్ మీటింగులో చంద్రబాబు ఇదే విషయం చెప్పి గట్టి హెచ్చరికలే జారీ చేశారు. వైసీపీకి మేలు చేయడం అంటే పాములు పాలు పోసినట్లే అని బాబు స్పష్టం చేశారు. మీరు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ పనులు చేసి పెట్టవద్దు అని ఆయన చెప్పారు. అలా చేస్తే మీకే నష్టమని కూడా తేల్చేశారు.
క్షేత్ర స్థాయిలో ఎవరెవరు ఎవరితో ఉన్నారో ఏమి చేస్తున్నారో మొత్తం డేటా ఉందని బాబు సంచలన ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడాలని పార్టీతో పాటు జనం కోసం పాటు పడాలని బాబు హితబోధ చేశారు. నన్ను పొగిడినా లేక నా చుట్టూ తిరిగినా పదవులు రావని బాబు పక్కా క్లారిటీ ఇచ్చారు.
మీరు జనంలో ఉంటూ వారి మన్ననలు పొందితే పదవులు వాటంతట అవే వస్తాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో రెండవ మాటకు తావే లేదని అన్నారు. పదవులు కావాలీ అంటే జనంలో మంచి పేరు తెచ్చుకోవాలి మాటలు కాదు ఓట్లు వేయించే వారుగా ఉండాలని ఆయన కోరారు. ఓట్లు ఎవరికి ఎంత ఉంటే వారే నాయకుడు వారే మొనగాడు, వారే విజేత అని బాబు స్పష్టం చేశారు.
తాను పార్టీకి ఎంతో సమయం ఇస్తున్నాను అని ప్రభుత్వంలో ఎన్నో పనులు ఉన్నా కార్యకర్తల కోసం కొంత అని వెచ్చిస్తున్నాను అని చెప్పారు. తనలాగే ప్రజా ప్రతినిధులు ఇతర నేతలు కూడా ఉండాలని బాబు కోరారు. అలా చేయని వారి జాబితా కూడా సిద్ధంగా ఉందని బాబు చెప్పారు. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి మీద ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పటికపుడు జరుగుతుందని అది అలా తన పని తాను చేస్తుందని బాబు అన్నారు. ఆ రికార్డుతో తనకు సంబంధం లేదని దాని పని దానిదే అని అన్నారు. ఆనక తేడా వస్తే తానేమీ చేయలేనని బాబు చెప్పేశారు.
మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉందని ఆయన అన్నారు. మొత్తం మీద చూస్తే కనుక చంద్రబాబు తమ్ముళ్ళకు చేసిన హెచ్చరికలు చర్చనీయాంశం అవుతున్నాయి. జనంలో ఉండాలని పార్టీ ముఖ్యమని చెబుతూ ఆయన నిరంతరం వారిని అలెర్ట్ చేయడం ద్వారా టీడీపీని పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తున్నారు అని అంటున్నారు. అలాగే వైసీపీ నేతలతో చట్టాపట్టాలు వేసే వారికి ఇబ్బందే అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ మీదట మీ ఇష్టమని బాబు అంటున్నారు అంటే ఇక పసుపు తమ్ముళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.