హైదరాబాద్ లో ఆందోళన... అద్దెలు ఏ రేంజ్ లో పెరిగాయంటే?

హైదరాబాద్ లో అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా టెక్ కారిడార్ లో ఇంటి అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Update: 2025-03-02 19:30 GMT

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఐటీ, ఫార్మా మొదలైన రంగాల్లో సంస్థలు తమ తమ కొత్త ఆఫీసులను హైదరాబాద్ కు తరలిస్తున్న పరిస్థితి! ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి ఉద్యోగులు అధిక సంఖ్యలో నగరానికి చేరుకుంటున్నారు. దీంతో.. అద్దెలు ఆకాశానికి చేరుతున్నాయని అంటున్నారు.

అవును... హైదరాబాద్ లో అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా టెక్ కారిడార్ లో ఇంటి అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. డబుల్ బెడ్ రూమ్, ట్రిపుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అద్దెలు 10 - 15% పెరిగాయని అంటున్నారు. ఈ సందర్భంగా పలు నివేదికలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... హైదరాబాద్ లోని టెక్ కారిడార్ లో 2బీ.హెచ్.కే అపార్ట్ మెంట్ లు ఇప్పుడు నెలకు రూ.40,000 వరకూ ఉంటున్నాయని.. ఇదే సమయంలో 3 బీ.హెచ్.కే అపార్ట్ మెంట్స్ అయితే మెయింట్ నెన్స్ ఛార్జీలు మినహాయించి రూ.50,000.. గేటేడ్ కమ్యునిటీలో రూ.70,000 వరకూ అద్దెలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.

ఇక మై హోమ్ భూజాలోని లగ్జరీ అపార్ట్ మెంట్ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఊహించని స్థాయిలో అన్నట్లుగా నెలకు రూ.2 లక్షల అద్దె డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఈ స్థాయిలో పెరుగుదలకు.. డిమాండ్ కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం ఒక కారణం అయితే.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం కూడా ఒక కారణమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో అద్దెదాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అద్దెల్లో వార్షిక పెరుగుదల రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ ఉందని చెబుతుండగా.. 2023లో గచ్చిబౌలిలోని ఓ కాలనీలో రూ.25,000 అద్దెకు డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ పొందగా.. ఇప్పుడు యజమాని రూ.35,000 కు పెంచాడని ఓ అద్దెదారు వాపోతున్న పరిస్థితి!

ఈ స్థాయిలో అద్దెలు పెరుగుతున్న వేళ డిమాండ్ కి తగ్గ సప్లైలో భాగంగా... మై హోమ్ సాయుక్, రాజపుష్ప ప్రొవెన్షియా, మై హోమ్ విపినా వంటి ప్రాజెక్టులు ఈ ఆక్యుపెన్సీ ధరలను స్థిరీకరించడంలో సహాయపడతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల గురించి వేచి చూడాలి!!

Tags:    

Similar News