డీకే శివ కుమార్ అవినీతి.. చంద్రబాబు, రేవంత్ లపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదని మన్నే క్రిశాంక్ ప్రశ్నిస్తున్నారు.;

Update: 2025-03-03 08:30 GMT

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై ఇటీవల ఎమ్మెల్యే మునిరత్న నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. మునిరత్న, లోకాయుక్తకు రాసిన లేఖలో డీకే శివకుమార్... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంధువుల వద్ద కమిషన్ తీసుకొని కర్ణాటకలో కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్‌పై సీరియస్‌గా ఉందని సమాచారం. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు.

కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదని మన్నే క్రిశాంక్ ప్రశ్నిస్తున్నారు. ఎవరో చనిపోతే కేటీఆర్ ఎందుకు ఈ విషయంలో విచారణ చేయమని అడగట్లేదు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఈ బెంగళూర్ కాంట్రాక్టుల విషయంలో రేవంత్ రెడ్డి తన పై విచారణ చేయమని అడుగుతాడా? అని మన్నే క్రిశాంక్ ప్రశ్నించారు.

కేపీసీ కంపెనీకి కర్ణాటకలో రూ. 210 కోట్ల కాంట్రాక్ట్ లభించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కేపీసీ సీఎండీ అనిల్‌కుమార్‌ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి మధ్య ఎలాంటి డీల్‌ జరిగిందన్నది వెల్లడించాలని మన్నే క్రిశాంక్ ప్రశ్నించారు.

ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అది చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ముడిపెట్టి బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది. మరి డీకే శివకుమార్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News