ఏ కార్లను ఎక్కువగా కొంటున్నారో తెలుసా?

చూస్తుండగానే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టటం.. రెండు నెలలు పూర్తి చేయటం జరిగిపోయింది. మార్చి ఆఖరుతో 2024 -25 ఆర్థిక సంవత్సరం కూడా పూర్తి కానుంది.;

Update: 2025-03-02 21:30 GMT

చూస్తుండగానే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టటం.. రెండు నెలలు పూర్తి చేయటం జరిగిపోయింది. మార్చి ఆఖరుతో 2024 -25 ఆర్థిక సంవత్సరం కూడా పూర్తి కానుంది. వాహన రంగానికి సంబంధించి ఫిబ్రవరిలో ఏ కంపెనీ కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ లెక్కల ఆధారంగా మార్కెట్ ఎలా ఉంది? వినియోగదారుల అభిరుచిలో వస్తున్న మార్పులు ఏమిటి? ఏ కంపెనీ కార్లను కొనేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది? ఏ మోడళ్లకు ఆదరణ ఉందన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

ప్యాసింజర్స్ వాహనాల తయారీ దిగ్గం మారుతి సుజుకీ స్వల్ప వ్రద్ధితో సరిపెట్టుకుంది. ఎస్ వీయూలు.. ఎంపీపీ మోడళ్లకు మార్కెట్ లో గిరాకీ పెరగింది. ఈ కారణంగానే మహీంద్రా మహీంద్రా.. టయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన అమ్మకాలు ఫిబ్రవరిలో రెండు అంకెల వ్రద్ధిని నమోదు చేసుకోవటం కనిపిస్తుంది. మారుతీ సుజుకీ దేశీయంగా ఫిబ్రవరిలో 1.60 లక్షల యూనిట్ల వాహనాల్ని అమ్మింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే వ్రద్ధి ఉండటం గమనార్హం.

మారుతికి సంబంధించి కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో.. సెలెరియో.. డిజైర్.. ఇగ్నిస్.. స్విఫ్ట్.. వేగన్ ఆర్ అమ్మకాలు పెరిగాయి. వీటితో పోలిస్తే యుటిలిటీ వాహన విభాగంలో బ్రెజ్జా.. గ్రాండ్ విటారా.. ఎర్టిగా.. ఎక్స్ ఎల్ 6 అమ్మకాలు గత ఏడాది ఫిబ్రవరిలో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువగా పెరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే హ్యుండై.. టాటా మోటార్స్.. హోండా కార్ల అమ్మకాలు క్షీణించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో పోలిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీల కార్ల అమ్మకాల్లో హోండా కార్స్ 21 శాతం క్షీణత నమోదు చేస్తే.. తర్వాతి స్థానంలో టాటా మోటార్స్ 8 శాతంతో ఉంది. ఆ తర్వాత హ్యుండై 3 శాతం క్షీణత నమోదు చేసింది.

దీనికి భిన్నంగా కియో ఇండియా గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది 24 శాతం వ్రద్ధి రేటును నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో ఎంజీ మోటార్ (16 శాతం) నిలిచింది. ఎం అండ్ ఎం (మహీంద్రా మహీంద్రా) 15 శాతం వ్రద్ధిని నమోదు చేయగా టాయోటా కిర్లోస్కర్ 13 శాతం అమ్మకాలు పెరిగాయి. మార్కెట్ లో ఎస్ వీయూలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. టూవీలర్ విషయానికి వస్తే రాయల్ ఎన్ ఫీల్డ్ 19 శాతం అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తే టీవీఎస్ మోటార్స్ 10 శాతం అమ్మకాలు పెరిగాయి. అదే సమయంలో సుజుకీ మోటార్ సైకిల్ 7 శాతం క్షీణత నమోదైంది.

Tags:    

Similar News