అమెరికాలో బ్యాలెట్ బాక్సులకు నిప్పు... ఎలా చేశారంటే..?
ఇదే సమయంలో వాషింగ్టన్ లోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ.. అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను వెంటనే అదుపుచేసినట్లు చెబుతున్నారు.
అగ్రరాజ్యమైనా, వెనుకబడిన ప్రాంతమైనా... ప్రతీ దేశంలోనూ దారుణాలకు ఒడిగట్టేవారు ఉంటూనే ఉంటారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టడాలు, ఈవీఎంలను నేలకేసి కొట్టడాలు వంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ సమయంలో అమెరికాలోనూ అలాంటి ఘటనే జరిగింది.. కాకపోతే కాస్త సైన్స్ వాడినట్లు తెలుస్తోంది!
అవును... అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ లు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని పలు ప్రంతాల్లో బ్యాలెట్ బాక్సులకు కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు.
ఒరెగాన్ లోని పోర్ట్ ల్యాండ్ లో రెండు వేరు వేరు ప్రాంతాల్లో మూడు బ్యలెట్ బాసులకు మంటలు చెలరేగి దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వాషింగ్టన్ లోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ.. అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను వెంటనే అదుపుచేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా బ్యాలెట్ బాక్సులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన పోర్ట్ ల్యాండ్ పొలీస్ అధికారి.. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3:30 నుంచి సోమవారం మధ్యాహ్నం 3:30 వరకూ తమ బ్యాలెట్లను సమర్పించిన ఓటర్లు తమకు ఆందోళనలు ఉంటే మాల్ట్ నోమా కౌంటీ ఎన్నిలా విభాగానికి చేరుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన వాషింగ్టన్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టీవ్ హోబ్స్.. ఈ సంఘటనలను ఖండించారు. వాషింగ్టన్ స్టేట్ లో చట్టబద్ధమైన, నిస్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు అంతరాయం కలిగించే ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తామని వెల్లడించారు. మరోవైపు ఫినిక్స్ లోనూ మెయిల్ బాసుకు నిప్పటించిన ఘటనలో ఓ వక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు!