నిరసన... భూమా అఖిల ప్రియ డిఫరెంట్ గా ప్లాన్ చేశారుగా?

నిరసనలయందు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నిరసనలు వేరయా అనే టైపులో ఓ ఆసక్తికర విషయం తాజాగా చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-03-27 16:43 GMT
నిరసన... భూమా అఖిల ప్రియ డిఫరెంట్  గా ప్లాన్  చేశారుగా?

నిరసనలయందు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నిరసనలు వేరయా అనే టైపులో ఓ ఆసక్తికర విషయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల నుంచి రూ.10 వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆరోపించారు. దీనికి కారణం ఏమిటి.. ఎందుకు నేరుగా ఎమ్మెల్యే ఇలా రియాక్ట్ అయ్యారనేది ఇప్పుడు చూద్దామ్..!

అవును... పత్రికల్లో వచ్చే ధరకే చికెన్ ఇప్పిస్తామని గతంలో ప్రెస్ మీట్ లో చెప్పానని.. దాని కోసం పోరాటం చేస్తుంటే.. కమిషన్ తీసుకుంటున్నమని వైసీపీ అనుకూల మీడియాలో రాస్తున్నారని చెబుతూ... కర్నూలులోని ఆ కార్యాలయం ఎదుట కోళ్లతో వినూత్న నిరసన తెలిపారు ఎమ్మెల్యే అఖిల ప్రియ. ఇదే సమయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా.. పూర్తి అవాస్తవాలు రాస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా స్పందించిన అఖిల ప్రియ... వాస్తవానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే మీడియా ఆఫీసులకు వచ్చి ధ్వంసం చేసేవాళ్లు కానీ.. కూటమి ప్రభుత్వంలో నిరసన తెలపాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదని.. అందుకే వారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగామని.. తాము అధికారంలోకి రాకముందు నంద్యాలతో కేజీ చికెన్‌ ధర రూ.250 నుంచి రూ.280 ఉండేదని తెలిపారు.

అయితే... టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆళ్లగడ్డలో చికెన్‌ ధర రూ. 150 నుంచి రూ.170 ఉంది. తాము అవినీతి చేసి ఉంటే ఇంకా రేటు పెరగాలి తప్ప.. ఎందుకు తగ్గుతుంది? తప్పుడు రాతలు రాస్తే కేసులు పెడుతున్నామని.. కోర్టులకెళ్తున్నామని.. అందుకే కక్షపూరితంగా మాపై నీచపు రాతలు రాస్తున్నారని అఖిల మండిపడ్డారు.

Tags:    

Similar News