జగన్ కి అదే పెద్ద అడ్వాంటేజ్ ?

ఈ ఇష్యూ ఇలా ఉండగా అసెంబ్లీ లోపల మాత్రమే కాదు బయట కూడా కూటమికి అసలైన ప్రతిపక్షం వైసీపీనే అని అంటున్నారు.

Update: 2024-09-05 03:41 GMT

ఏపీలో వైఎస్ జగన్ ధీమా వెనక చాలా కారణాలు ఉన్నాయి. పార్టీని ఎంతో మంది నేతలు వీడిపోతున్నా జగన్ పట్టించుకోకపోవడం వెనక కూడా ఆయనకు ఉన్న వ్యూహాలు ఆయనకు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే ప్రజలు కట్టబెట్టారు. అంటే ఆ పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు అన్న మాట.

ఎక్కడ 151 సీట్లు మరెక్కడ 11 సీట్లు అన్నది అయితే ఉంది. ఇంత ఘోరంగా వైసీపీ ఓడింది కాబట్టి ఆ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అని అంతా అనుకున్నా అది జరిగేలా లేదు. ఏపీ రాజకీయాలలో ఉన్న పరిస్థితులే వైసీపీకి శ్రీరామ రక్షగా మారుతున్నాయి. అంతే కాదు వైసీపీకి సీట్లు అయితే 11 మాత్రమే వచ్చినా ఓట్ల శాతం చూస్తే 40 గా ఉంది.

అది వైసీపీకి మరో ధీమాకు కారణం. ఇక చూస్తే అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్ష పాత్ర ఇచ్చి గుర్తించడానికి టీడీపీ కూటమి సరేమిరా అంటోంది. ఆ పార్టీకి ప్రజలే ఆ అవకాశం ఇవ్వలేదు అని అంటున్నారు కూటమి పెద్దలు. దానికి వైసీపీ వాదన వేరేగా ఉంది.

ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేషన్ కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకే ఇవ్వాలని అంటోంది. దానికి సీట్లతో నంబర్ తో సంబంధం ఏమిటి అని అంటోంది. అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలు అయితే అందులో మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయని కూడా గుర్తు చేస్తోంది వైసీపీ. అలా చూస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే విపక్షంగా వైసీపీ మాత్రమే ఉంది కాబట్టి మెయిన్ అపొజిషన్ అయినా లేక అపొజిషన్ అయినా టెక్నికల్ గానే కాదు లాజికల్ గా కూడా తామే ఉంటామని బల్ల గుద్ది మరీ చెబుతోంది.

ఈ ఇష్యూ ఇలా ఉండగా అసెంబ్లీ లోపల మాత్రమే కాదు బయట కూడా కూటమికి అసలైన ప్రతిపక్షం వైసీపీనే అని అంటున్నారు. అసెంబ్లీ బయట కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. కానీ ఈ పార్టీలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్ కి క్యాడర్ లీడర్ రెండూ సమస్యగానే ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నా ఒక్క నాయకుడు కూడా వైసీపీ నుంచి ఆ పార్టీలో చేరలేదు అన్నది గమనించాలి.

ఇక కేవలం రెండు శాతం మాత్రమే ఓటు షేర్ ని ఇటీవల ఎన్నికల్లో తెచ్చుకున్న కాంగ్రెస్ 2029 నాటికి ఏపీలో అధికారంలోకి వచ్చేంతలా ఎగబాకుతుంది అంటే అది అద్భుతమే తప్ప జరిగేది కాదని అంటున్నారు. వామపక్షాలది అదే పరిస్థితి. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా దానికి క్యాష్ చేసుకోవడానికి వైసీపీ మాత్రమే గ్రౌండ్ లో రెడీగా ఉంది అని అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో అసలైన అపొజిషన్ ప్రజలు. వారికి నచ్చకపోతే అధికార పార్టీకి సమీపంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు. తెలంగాణలో చూసుకున్నా అదే జరిగింది. ఎన్నికలకు ముందు వరకూ ఎగిరెగిరి పడిన బీజేపీ తీరా ఎన్నీకల వేళకు మూడవ స్థానానికి పడిపోయింది. బీఆర్ఎస్ ని దించాలీ అంటే కాంగ్రెస్ మాత్రమే అసలైన ఆల్టరేషన్ అని జనాలు గుర్తించి ఓటు వేశారు. అధికారంలోకి తెచ్చారు.

ఇక కాంగ్రెస్ కి కూడా గ్రౌండ్ లెవెల్ లో బలం ఉండడం ఒక పార్టీలో ఓటు షేర్ ఉండడం వంటివి ఉపయోగపడ్డాయి. ఏపీలో కూడా వైసీపీది అదే పరిస్థితి అని అంటున్నారు. ఈ రోజున వైసీపీ నుంచి ఎంతమంది కూటమిలో చేరినా ఎన్నికల వేళకు పోటీ మాత్రం వైసీపీ కూటమి మధ్యనే ఉంటుంది. టీడీపీ కూటమి మీద జనాలకు మొహం మొత్తినా ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా అది వైసీపీకే భారీ అడ్వాంటేజ్ అవుతుంది అని అంటున్నారు.

ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను గుత్తమొత్తంగా పొందేందుకు వైసీపీ మాత్రమే గ్రౌండ్ లెవెల్ లో బలంగా ఉన్న పార్టీ. మిగిలిన పార్టీలేవీ దరిదాపుల్లో లేకపోవడం వైసీపీ తప్ప మరో పార్టీ కూడా విపక్షంలో ఆ స్థాయిలో లేకపోవడమే వైసీపీకి కలసి వస్తున్న అదృష్టమని అంటున్నారు. అందుకే వైసీపీ అధినాయకత్వం ధీమాగా ఉంది.

ఈ రోజున కూటమి మీద మోజు ఉండవచ్చు. అయిదేళ్లూ గడిచే కొద్దీ అలా ఉండకపోవచ్చు కూడా. అపుడు కచ్చితంగా యాంటీ ఇంకెంబ్నెన్సీని తన నలభై శాతం ఓటు షేర్ తో కలుపుకుని ముందుకు సాగేందుకు ఫ్యాన్ పార్టీకి మాత్రమే గొల్డెన్ చాన్స్ ఉందని అంటున్నారు. ఏపీలో ఇదీ పొలిటికల్ సీన్.

Tags:    

Similar News