రేవంత్‌కు సొంత జిల్లాలోనే షాక్.. బీఆర్ఎస్‌కు జోష్!
దీంతో కేసీఆర్‌కు కాస్త ఉపశమనం దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటు దక్కే పరిస్థితిలో లేని బీఆర్ఎస్‌కు కాస్త ఊరటనిచ్చే విషయమిది. వరుసగా షాక్‌ల మీద షాక్‌ల తింటున్న ఆ పార్టీకి ఓ గుడ్ న్యూస్. అవును.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో కేసీఆర్‌కు కాస్త ఉపశమనం దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న కాంగ్రెస్‌కు, రేవంత్‌కు షాక్ తగిలిందనే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వస్తాయనే ధీమాతో ఉన్న రేవంత్‌కు ఇప్పుడీ ఫలితం మింగుడుపడనిదే. అది కూడా సొంత జిల్లాలో ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోవడం రేవంత్‌కు భారీ షాకే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తేలిపోయింది. నవీన్ కుమార్ 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించాయి. మార్చి 28న పోలింగ్ జరిగింది. ఇక్కడి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నేతల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉండటమే ఆ పార్టీ అభ్యర్థికి కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రావడంతో ఇటీవల జరిగిన వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏ పార్టీ నెగ్గుతుందనే ఆసక్తి మరింత పెరిగింది.