బాబు తెచ్చిన లడ్డూ ఇష్యూ...ఏపీలో బీజేపీకి గోల్డెన్ చాన్స్
దాంతో బీజేపీకి ఇపుడు శ్రీవారి లడ్డూ అంశం కూడా సీరియస్ గానే ఫోకస్ పెట్టిన ఉందని అంటునారు.
బీజేపీ నినాదమే హిందూత్వ. ఆ పార్టీ విధానమే హిందూత్వ. బీజేపీ ఎక్కడ చూసినా హిందూత్వ అంశంతోనే ముడిపెడుతుందని విపక్షాలు విమర్శిస్తాయి. ఇదిలా ఉంటే ప్రపంచానికి పరమ పవిత్రమైన దేవుడిగా ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో కేంద్ర బీజేపీ పెద్దలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.
బాబు నుంచి నివేదికలను కోరారు. బీజేపీ ఆరెస్సెస్ దీని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా హిందూత్వ సంస్థలు కూడా ఈ ఇష్యూలోకి వస్తున్నాయి. ఇది ఏపీలో పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. కానీ బీజేపీ మాత్రం దీనిని ఆధ్యాత్మిక కోణంలో ఎక్కువగా చూస్తోంది. తెలంగాణాకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా దీనిని ఖండించారు.
కఠినమైన చర్యలు బాధ్యులు మీద తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక బీజేపీ కూడా ఈ విషయం తెలిసిన తరువాత సీరియస్ గానే అడుగులు వేస్తుందని అంటున్నారు. వీలైతే సీబీఐ విచారణకు అదేశించి మరీ లోతైన దర్యాప్తునకు చూస్తుందని చెబుతున్నారు.
అదే సమయంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విషయాన్ని కూడా బీజేపీ పరిశీలించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ బోర్డు ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
ఈ బోర్డులో ప్రజా ప్రతినిధులు, హిందూ మఠాధిపతులు, న్యాయవాదులు, పౌర సమాజంలోని కీలక రంగాలకు చెందిన ఆధ్యాత్మిక పరులను తీసుకోవాలని పవన్ సూచించారు. దీని వల్ల సనాతన ధర్మానికి అన్యాయం జరగకుండా ఉంటుందని ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది కలిగినా దానిని సరిద్దేలా ఉంటుందని పవన్ అంటున్నారు.
పవన్ చేసిన ప్రతిపాదన మీద బీజేపీ నుంచి అధికారికంగా ఎవరూ రెస్పాండ్ కాకపోయినా హిందూత్వ సంస్థలు సనాతన ధర్మం పట్ల మక్కువ కలిగిన వారు అంతా స్వాగతిస్తున్నారు. ఆ విధంగా చేయాలని కోరుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడు కాబట్టి ఈ సూచనను బీజేపీ పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ధార్మిక సంస్థలకే టీటీడీ సహా దేవాలయాలు అన్నీ అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. రాజకీయ వాసనలు ఉన్న వారిని పాలక మండలిలో పెట్టి వారి నాయకత్వంలో హిందూ దేవాలయాలు పనిచేయించడం వల్లనే కలుషితం అవుతున్నాయని ధర్మం తెలియని వారి చేతిలో నలిగిపోతున్నాయ్ని కూడా అంటున్నారు.
అందువల్ల లడ్డూ ఇష్యూ ఒక దానికి వస్తే దాని నుంచి అనేక రకాలుగా అవకాశాలను వాడుకునేందుకు చాన్స్ ఉంది. బీజేపీకి ఏపీలో బలపడాలని ఉంది. దాంతో బీజేపీకి ఇపుడు శ్రీవారి లడ్డూ అంశం కూడా సీరియస్ గానే ఫోకస్ పెట్టిన ఉందని అంటునారు. ఏది ఏమైనా బీజేపీ మాత్రం సంచలన నిర్ణయాలనే ఏపీ విషయంలో తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో తీసుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
ఇంకో వైపు పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్ష వంటివి కూడా ఏపీలో ఒక ప్రధాన వర్గాన్ని ఏకీకృతం చేసేందుకు దోహదపడతాయి. అలా మిత్రపక్షం బీజేపీకి కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు.