స్టార్ క్యాంపెయినర్ కాదా... అయితే హిమాలయాలకే పయనం!

త్వరలో ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో ఆ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి

Update: 2023-10-29 05:27 GMT

త్వరలో ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో ఆ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. దీంతో... ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ ఐదురాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటితే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రయాణం మరింత సులువవుతుందని భావిస్తున్నారు. పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు దెబ్బ కొట్టడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా... అభ్యర్థుల ఎంపిక, క్యాంపెయినర్ల ఎంపికలలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకరోజు అలస్యం అయినా పర్లేదు కానీ.. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నది వారి ఉద్దేశ్యంగా ఉందనే కామెంట్లు వినిపిస్తునాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ కాంపెయినర్లను ప్రకటించింది. దీంతో తన పేరు లేదని యూపీ మాజీ సీఎం హర్ట్ అవుతున్నారు.

అవును... వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 40 మందిని స్టార్ కాంపెయినర్లను ఎంపిక చేసింది. అయితే ఈ స్టార్ కాంపెయినర్ల జాబితాలో ఉమాభారతి పేరు లేదు. దీంతో మాజీ ముఖ్యమంత్రి అయిన తన పేరు లేకపోవడం ఏమిటంటూ... ఆమె హర్టయ్యారు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.

గత ఎన్నికల్లో కనీసం ప్రచారంలో ఉన్న ప్రాధాన్యత కూడా లేకపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. దీంతో... తాను హిమాలయాలకు వెళుతున్నట్లుగా ఉమాభారతి ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన యూపీ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి... "ఈరోజు నా జన్మస్థలికి వెళుతున్నా. మా కులదేవత రామరాజ ప్రభువుకు పూజలు చేశాక హిమాలయాలకు బయలుదేరుతా" అని ఆమె ట్వీట్‌ చేశారు.

కాగా... రెండు దశాబ్దాల కిందటి దాకా ఫైర్‌ బ్రాండ్‌ గా మధ్యప్రదేశ్‌ బీజేపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఉమాభారతి (64)ని ప్రస్తుతం బీజేపీ పరిగణలోకి తీసుకోవడం లేదనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీకి నవంబరులో జరగనున్న ఎన్నికలకు 40 మంది పేర్లతో ఆ పార్టీ ప్రకటించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఈమెకు చోటు కూడా దక్కలేదు.

మధ్యప్రదేశ్‌ లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ గత అయిదేళ్లుగా ఈమెను వ్యూహాత్మకంగా క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరం పెట్టారని తెలుస్తుంది! గతంలో 2018 నాటి ఎన్నికల్లో కనీసం ప్రచారంలో ప్రాధాన్యం కల్పించినప్పటికీ... ఈసారి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో హర్ట్ అయిన ఆమె.. హిమాలయాలకు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు! దీంతో ఈ విషయం హాట్ టాపిక్ మారింది!

Tags:    

Similar News