హిస్టరీ రిపీట్ కాలేదు.. కమలనాథుల ‘400’ కల నెరవేరదంతే

తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూస్తే అలాంటి పరిస్థితి కాకుండా.. మిత్రుల మీద ఆధారపడక తప్పని పరిస్థితితో పాటు.. కీలక బిల్లుల విషయంలో కొత్త మిత్రుల అవసరం ఖాయమని తేలిపోయినట్లే.

Update: 2024-06-04 06:13 GMT

“దాల్ మే కుచ్ కాలా హై” అన్న మాటకు తగ్గట్లే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే పనిగా పలు మీడియా సంస్థలకు.. జర్నలిస్టులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వటాన్ని కొందరు అనుమానంగా చూశారు. టార్గెట్ 400 అంటూ భారీ మాటలు చెబుతున్నా.. గ్రౌండ్ లో అంత సీన్ లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాథులు.. ఆ విషయాన్ని గుట్టుగా దాచేసి.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను విస్తరించే ప్రయత్నం చేశారన్న విషయం తాజా ఫలితాల్ని చూస్తే అర్థమవుతుంది. పదేళ్లుగా ప్రధానమంత్రిగా ఉంటూ ఎంపిక చేసిన అంతర్జాతీయ మీడియా సంస్థలకు.. ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులకు తప్పించి ఎవరికి అందుబాటులోకి వచ్చేందుకు.. వారితో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఇష్టపడని తీరు తెలిసిందే.

అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ఇచ్చారు. గెలుపు ధీమా తగ్గిన నేపథ్యంలో.. తమ ప్రభుత్వం చేసిన పనులు.. సాగించిన డెవలప్ మెంట్ తో పాటు.. తమ రాజకీయ ప్రత్యర్థులు తన పాలనపై చేస్తున్న విమర్శలకు సమాధానాలు ఇచ్చేందుకు ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. పేరుకు 400 ప్లస్ సీట్ల లక్ష్యమన్నట్లుగా మాటలు చెప్పిన వైనం చూసిన కొందరు చూసి.. నిజమేనని భావించటం తెలిసిందే.

అయితే.. రోటీన్ కు భిన్నమైన పోకడ మోడీషాలలో కనిపించటం.. ఆయన ఎక్కువగా సౌత్ మీద ఫోకస్ చేసినప్పుడు చూస్తే.. నార్త్ లో ఏదో తేడా కొడుతుందన్న ప్రచారం జరిగింది. తాజాగా వెలువడుతున్న ఫలితాల సరళిని చూస్తే విషయం అర్థమవుతుంది. కొందరు విశ్లేషకుల అంచనా ప్రకారం ఈసారి ముక్కి ములిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. గడిచిన పదేళ్లలో తన మిత్రుల విషయంలో మోడీషాలు అనుసరించిన తీరుకు భిన్నంగా ఈసారి వారు కొత్త పాత్రను పోషించాల్సి ఉంటుందన్న మాటలు వినిపించేవి.

తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూస్తే అలాంటి పరిస్థితి కాకుండా.. మిత్రుల మీద ఆధారపడక తప్పని పరిస్థితితో పాటు.. కీలక బిల్లుల విషయంలో కొత్త మిత్రుల అవసరం ఖాయమని తేలిపోయినట్లే. అదే టైంలో 400 ప్లస్ సీట్ల మార్కును సొంతం చేసుకోవటం సాధ్యం కాదని స్పష్టమైంది. మొత్తంగా చూస్తే.. గెలిచి ఓడిన చందంగా మారిందని చెప్పక తప్పదు. అందుకే అంటారు.. నలుగురు మిత్రుల అవసరం ఎంతో ఉంటుందని. బలంగా ఉన్నప్పుడు స్నేహితులకు అండగా నిలిచి ఉంటే.. ఇవాల్టి పరిస్థితి మోడీషాలకు వచ్చేది కాదేమో?

Tags:    

Similar News