దక్షిణాదిన బీజేపీ ...ఆ రెండు స్టేట్స్ లో షాకింగ్ రిజల్ట్స్...!

బీజేపీని ఉత్తరాది పార్టీ అని చాలా ఏళ్ళుగా అంటూ వచ్చారు. దక్షిణాదిన ఆ పార్టీ పునాది వేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా పట్టు చిక్కలేదు.

Update: 2024-03-05 00:30 GMT

బీజేపీని ఉత్తరాది పార్టీ అని చాలా ఏళ్ళుగా అంటూ వచ్చారు. దక్షిణాదిన ఆ పార్టీ పునాది వేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా పట్టు చిక్కలేదు. కర్నాటక మాత్రం కొంత వరకూ బలంగా మారింది. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కర్నాటకలో అధికారం చేజారింది. లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని బీజేపీ చూస్తోంది.

కర్నాటకలో మొత్తం 28 సీట్లు ఉంటే 2019లో పాతిక దాకా సీట్లు సాధించిన బీజేపీ ఈసారి సొంతంగా 22 సీట్లను సాధిస్తుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. లోటెస్ట్ గా ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఒపీనియన్ పోల్ అంచనా మేరకు చూస్తే కర్నాటకలో బీజేపీ నంబర్ తగ్గుతుంది అని లెక్క వేసింది. అయితే ఆ లోటుని కొత్తగా పొత్తు పెట్టుకున్న జేడీఎస్ తో తీర్చుకునే అవకాశం ఉంది.

జేడీఎస్ కి కర్నాటకలో రెండు ఎంపీ సీట్లు దక్కనున్నాయి. ఇదే సర్వే కాంగ్రెస్ కి నాలుగు సీట్లను కట్టబెట్టింది. అంటే 2023లో కర్నాటకలో సాధించిన విజయం ఈసారికి దిగదుడుపు అవుతుంది అని అంటోంది. ఇదే సర్వేలో మరికొన్ని విషయాలు వెల్లడి అయ్యాయి. తమిళనాడులో సొంతంగా బీజేపీ అయిదు ఎంపీ సీట్లను గెలుచుకుంటుంది అనంది ఆ సర్వే ఫలితం.

తమిళనాడులో 2019లో అన్నా డీఎంకేతో కలసి పోటీ చేసినా పెద్దగా ఫలితం ఇవ్వని బీజేపీకి ఈసారి అంతా ఆశాజనకంగా ఉంటుంది అన్నది ఈ సర్వే సారాంశం. మొత్తం 39 ఎంపీ సీట్లు ఉన్న తమిళనాడులో బీజేపీ సొంతంగా అయిదు సీట్లు గెలవడం అంటే గొప్ప విషయమే. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే మీద వ్యతిరేకత గట్టిగా ఉంది అని టాక్. అలాగే బీజేపీ కొత్త ప్రెసిడెంట్ అన్నామలై జనంలో దూసుకుని పోతున్నారు.

దాంతో ఆయన ప్రభావంతో మోడీ ఇమేజ్ తో తమిళనాడులో న్యూ పొలిటికల్ ట్రెండ్ గా వ్యాప్తిలోకి వస్తున్న హిందూత్వ సెంటిమెంట్ కూడా పండి బీజేపీకి ఈ సీట్లు దక్కుతాయని అంటున్నారు. చిత్రంగా కేరళలో కూడా బీజేపీకి మూడు సీట్లు వస్తాయని అంటున్నారు. అక్కడ ఇరవై సీట్లు ఉంటే కాంగ్రెస్ కూటమికి 10 సీట్లు వామపక్షాలకు ఆరేడు సీట్లు వస్తే బీజేపీకి తొలిసారి మూడు సీట్లతో బోణీ దక్కుతుందని అంటున్నారు.

తెలంగాణాలో చూస్తే బీజేపీకి గతసారి నాలుగు సీట్లు వచ్చాయి. ఈసారి ఒక సీటు అదనంగా తెచ్చుకుని అయిదింటితో సెకండ్ ప్లేస్ లో నిలుస్తుంది అని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తొమ్మిది సీట్లను గెలుచుకుంటుంది అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రెండంటే రెండు సీట్లు దక్కుతాయట. ఏపీలో చూస్తే బీజేపీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అని ఈ సర్వే తేల్చింది.

ఈ సర్వే అంచనాల మేరకు టోటల్ గా బీజేపీకి దక్షిణాదిన నాలుగు రాష్ట్రాలు కలిపి ముప్పయి అయిదు దాకా వస్తాయని అంటున్నారు. ఇందులో ఏపీ జీరో అయినా తమాషా ఏంటి అంటే ఏపీలో పాతిక ఎంపీ సీట్లూ బీజేపీకే దక్కుతాయని అంతా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు వైసీపీ టీడీపీలు గెలిచిన ఎంపీలను పోటీ పడి బీజేపీకే మద్దతుగా ఇస్తాయన్నది తెలిసిందే.

ఈ టోటల్ లెక్క తీస్తే కనుక దక్షిణాదిన ఉన్న అయిదు రాష్ట్రాలలో కలుపుకుని మొత్తం ఎంపీ సీట్లు 129 ఉంటే అందులో బీజేపీ సొంతంగా 35 గెలుచుకుంటే ఏపీ నుంచి అప్పనంగా మరో పాతిక సీట్లు వస్తాయి. అంటే అరవై సీట్ల దాకా బీజేపీకి సౌతిండియా ఇస్తుందన్న మాట అయోధ్య రామాలయం వేవ్ ఎటూ ఉంది. మోడీకి ఇంటర్నేషనల్ ఫేమ్ నేమ్ ఉన్నాయి.

ఆ ఇమేజ్ తో నార్త్ స్టేట్స్ లో బీజేపీ తొంబై శాతం సీట్లు తెచ్చుకుంటే గతసారి కంటే ఈసారి కొన్ని సీట్లు ఎక్కువగా సౌత్ స్టేట్స్ లో బీజేపీకి విజయం దక్కనుంది. ఎలా చూసుకున్నా బీజేపీ హ్యాట్రిక్ విజయానికి సౌత్ స్టేట్స్ ఈసారి తమ వంతుగా మద్దతు ఇచ్చేలాగానే ఉన్నాయని అంటున్నారు. అందుకే బీజేపీ బే ఫికర్ గా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News