మేనల్లుడి చెక్ పెట్టేస్తున్న బొత్స...?

విజయనగరం జిల్లా రాజకీయాలలో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఆయన 1985 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు

Update: 2023-10-28 15:30 GMT

విజయనగరం జిల్లా రాజకీయాలలో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఆయన 1985 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ టికెట్ కూడా ఆశించారు. 1990 ప్రాంతంలో విజయనగరం జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా గెలిచారు. ఆ తరువాత బొబ్బిలి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. ఆ మీదట రెండు సార్లు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో 1999 దాకా బొత్స రాజకీయ ఆశలు తీరలేదు.

అలా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా మధ్యలో ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు. 2004 నుంచి మంత్రిగా పదేళ్ళ పాటు చేశారు. 2019 నుంచి జగన్ క్యాబినేట్ లో అయిదేళ్ల మంత్రిగా ఉంటున్నారు. ఇలా చూసుకుంటే ఉత్తరాంధ్రాలో పదిహేనేళ్ళ పాటు మంత్రిగా చేసిన రికార్డుని సొంతం చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బొత్స కాంగ్రెస్ హయాం నుంచి జిల్లా రాజకీయాలను తన కనుసన్నలలో నడుపుకుంటూ వస్తున్నారు. అది 2019 దాకా సాగింది.

ఇక వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఆయనను జిల్లా పరిషత్ చైర్మన్ ని చేసిన జగన్ విజయనగరం జిల్లా పార్టీ పగ్గాలు ఆయనకే ఇచ్చారు. దాంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ ఒక పార్లమెంట్ సీటుకి అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు మజ్జి శ్రీనివాసరావు రెడీ అయ్యారు.

అయితే ఇక్కడే బొత్స ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. తన పరోక్షంలో ఉండే మేనల్లుడి వైసీపీ హయాంలో జిల్లా రాజకీయాల్లో ఎదిగిపోతున్నారు అని గ్రహించిన ఈ సీనియర్ మంత్రి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలసి బొత్స జిల్లాలో తనదైన రాజకీయం నెరుపుతున్నారని, తాను కోరుకున్న వారిక టికెట్లు ఇప్పించుకుంటున్నారని అంటున్నారు.

ఎస్ కోట నుంచి తాను పోటీ చేయాలని మజ్జి శ్రీనివాసరావు ఆలోచించారు. అయితే ఆ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే మళ్లీ టికెట్ దక్కేలా బొత్స చక్రం తిప్పారని అంటున్నారు. అదే విధంగా విజయనగరం ఎంపీ గా మేనల్లుడు పోటీ చేస్తారు అన్న వార్తల నేపధ్యంలో అక్కడ నుంచి తన సతీమణి బొత్స ఝాన్సీని పోటీకి దింపుతున్నారని తెలుస్తోంది. ఇక గజపతినగరం టికెట్ ని తిరిగి తన తమ్ముడు బొత్స అప్పలనరసయ్యకు వచ్చేలా చూసుకున్నారని అంటున్నారు. ఇపుడు బొత్స మేనల్లుడికి ఆప్షన్లు అయితే కనిపించడంలేదు అని అంటున్నారు.

ఆయన పోటీ చేస్తే బొబ్బిలి నుంచే బరిలోకి దిగాలి. అక్కడ వెలమ ప్లస్ కాపుల డామినేషన్ ఉంటుంది కాబట్టి ఆ సీటు నుంచి లక్ పరీక్షించుకోవాలని అంటున్నారు. అది కాకపోతే ఏకంగా జిల్లా దాటి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు బదిలీ కావాలని అంటున్నారు. అయితే అక్కడ సీటు కూడా విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోసం బొత్స రిజర్వ్ చేసి పెట్టారని అంటున్నారు.

ఇక ఇటీవల వియ్యంకులుగా నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు మజ్జి శ్రీనివాసరావు అయ్యారు. దాంతో నెల్లిమర్ల టికెట్ కి కూడా టిక్ పెట్టేలా బొత్స వ్యూహ రచన చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి బొత్స మేనల్లుడు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా హవా మాత్రం మరో మారు బొత్సదే అని అంటున్నారు. చిత్రమేంటి అంటే మజ్జి శ్రీనివాసరావు జగన్ కి ఇష్టుడు. మరి నేరుగా ఆయన వద్దకు వెళ్ళి బొత్స మేనల్లుడు ఏమైనా చెబితే ఆయనకు జిల్లాలో వ్యవహారాలు సానుకూలం అవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News